పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూటింగ్ పై స్టన్నింగ్ అప్డేట్..!!

frame పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూటింగ్ పై స్టన్నింగ్ అప్డేట్..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మూవీ ‘OG’. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంటే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా, తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయ పనుల వల్ల ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి.కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవ్వడంతో.. OGతో పాటు ఇతర చిత్రాల షూటింగ్స్ కి కూడా బ్రేక్ లు పడ్డాయి. 90’s బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన బ్యాలన్స్ షూట్ ని కూడా పూర్తి చేయనున్నారు. పవన్ చాలా కాలం తరువాత ఒక గ్యాంగ్ స్టార్ నేపథ్యం సినిమా చేస్తుండడంతో.. పవన్ అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ లో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఆల్రెడీ కమిటైన సినిమాలను పూర్తి చేసి నిర్మాతలను ఒడ్డున పడేయ్యాలని పవన్ భావిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. వీటిలో ఓజీ కంప్లీట్ కావొచ్చింది.. కేవలం పవన్ చేయాల్సిన పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఆయన రాక కోసం చిత్ర యూనిట్, అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇదిలావుంటే డిప్యూటీ సీఎం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్లో ఉంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఓజీ నిర్మాత డివివి దానయ్య పవర్ స్టార్ ను కలిసి డేట్స్ పై చర్చించారు. అక్టోబర్ నుంచి షూటింగ్లో పాల్గొంటానని నిర్మాతకు పవన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఆ తరువాత సమయాన్ని బట్టి హరిహర వీరమల్లు,ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. అక్టోబర్ నుంచి తిరిగి షూటింగ్‌లో పవన్ పాల్గొంటున్నారని దాని సారాంశం. తను ఆల్రెడీ కమిట్ అయిన ఓజీ, హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్‌లను పూర్తి చేయడానికి నెలకు 10 రోజులు కేటాయిస్తారని సమాచారం. డిప్యూటీ సీఎం హోదాలో పూర్తిగా రాజకీయాలు, ప్రజాసేవకే సమయం కేటాయించాలని అనుకుంటున్నందున కొత్త సినిమాలకు పవన్ సైన్ చేయరని జనసేన వర్గాల టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే జనసేనాని అక్టోబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొంటారా , లేదా అన్నది త్వరలోనే తెలిసిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: