సమంతకు ప్రపోజ్ చేసిన రోజే.. నాగచైతన్య ఎంగేజ్మెంట్?

frame సమంతకు ప్రపోజ్ చేసిన రోజే.. నాగచైతన్య ఎంగేజ్మెంట్?

praveen
సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ సెలబ్రిటీ జంట.. ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి.. అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఇద్దరు ఎందుకు విడిపోయారు అనే విషయంపై ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత ఒకవైపు నాగచైతన్య ఇంకోవైపు సమంత ఎవరికీ వారు కెరియర్ లో ఫుల్ బిజీ అయిపోయారు.

 అయితే ఇక విడాకుల విషయం ఈ ఇద్దరు మరిచిపోయారేమో కానీ ఇంటర్నెట్ జనాలు మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఇక ఎప్పుడూ వీరిద్దరు విడాకులకు సంబంధించి ఏదో ఒక అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి నాగచైతన్య  టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇక వీరిద్దరూ వెకేషన్ కు వెళ్తున్నారు అంటూ కొన్ని ఫోటోలు కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఇవన్నీ వాస్తవం కాదు అంటూ ఇద్దరూ కూడా స్పందించారు. ఇన్నాళ్లు ఇంటర్నెట్ జనాలు అనుకున్నదే నిజమైంది అన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.

 ఇటీవల నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న నాగచైతన్య శోభిత ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తల నిజమే అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఇది ఇలా ఉంటే సమంతకు ప్రపోజ్ చేసిన రోజే నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అనే వార్త వైరల్ గా మారింది  ఏం మాయ చేసావే రిలీజ్ అయ్యాక ఆగస్టు 8వ తేదీన సమంతకు నాగచైతన్య ప్రపోజ్ చేశాడని.  ఇక ఇదే రోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని.. దీని వెనక అంతర్యం ఏమిటో అంటూ సరికొత్త విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: