చైతూ రెండో పెళ్లి.. మండిపడుతున్న సమంత ఫ్యాన్స్..!!

frame చైతూ రెండో పెళ్లి.. మండిపడుతున్న సమంత ఫ్యాన్స్..!!

murali krishna
టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత దూళిపాళ నిశ్చితార్ధం ఈ రోజు ఉదయం నాగార్జున ఇంట్లో జరిగింది.అక్కినేని నాగ చైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు ఇచ్చేశాడు. అప్పటి నుంచి అతడు సింగిల్‌గా ఉంటున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, చైతూ మాత్రం తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు. దీనిపై అప్పుడప్పుడూ లీకులు కూడా వచ్చాయి. దీంతో వీళ్ల వ్యవహారం చాలా రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది.ఇక ఆ ప్రచారానికి ఊతమిస్తూ నాగ చైతన్య శోభిత ఇద్దరు లండన్ లోని హోటల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వారిద్దరి రిలేషన్ ను బయటపెట్టాయి.అప్పటి నుంచి వీళ్ల రిలేషన్‌షిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం ప్రారంభమయ్యింది. కానీ ఇద్దరూ ఎప్పుడు ఈ విషయంపై ఎక్కడా రియాక్ట్‌ అవ్వలేదు. ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఫైనల్‌గా ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పుడు సమంత చెప్పిన మాటలు చేసిన ఆరోపణలను గుర్తు చేసుకుంటున్నారు అందరూ. చివరికి సామ్‌ చెప్పిందే నిజమయ్యింది అంటున్నారు.శోభిత వల్లే తనకు చైతన్యకు మధ్య గ్యాప్‌ వచ్చిందని ఆరోపించింది. డైరెక్ట్‌గా శోభిత పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా.. చాలా పోస్టుల్లో తన బాధను ఫ్యాన్స్‌తో పంచుకుంది. సమంత సన్నిహితులు కూడా చాలా సార్లు శోభితను టార్గెట్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. దీంతో చైతన్య సమంత మేటర్‌లో శోభిత కూడా చాలా కాలం ట్రెండ్‌ అయ్యింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న శోభిత 2016లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అడవి శేష్‌తో చేస్తున్న ఓ సినిమా షూటింగ్‌లో నాగ చైతన్యకు శోభితకు పరిచయం ఏర్పడింది. ఎప్పుడైతే శోభిత చైతన్య లైఫ్‌లోకి వచ్చిందో అప్పటి నుంచి తనకు చైతన్యకు మధ్య గ్యాప్‌ మొదలయ్యిందని సమంత చాలా సార్లు చెప్పింది. కానీ అప్పుడు ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. చైతన్య శోభితకు సంబంధించిన ఫొటోలు ఎన్ని లీకైనా ఈ ఇష్యూ పెద్దగా హైలెట్‌ అవ్వలేదు.దాంతో సమంత అభిమానులు ఒకవైపు తల్లికి జరిగిన స్థితి చూసి కూడా ఇంకొక ఆడదానికి అలాంటి పరిస్థితి కల్పించడానికి నీకెలా అనిపించింది బ్రో అంటూ సామ్ అభిమానులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: