HBD: మహేష్ బాబు గురించి తెలియని విషయాలు ఇవే..!
కోలీవుడ్ నటుడు కార్తి, నటుడు విజయ్ కూడా మహేష్ బాబు క్లాస్ మేట్స్ వీరి ముగ్గురు కలిసి కొంతవరకు చదువుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని హీరో కార్తీ తెలియజేశారు. అంతేకాకుండా మహేష్ బాబుకు విజయ్ కి కూడా మంచి స్నేహబంధం ఉందని మహేష్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచినటువంటి పోకిరి, ఒక్కరి చిత్రాలను కూడా విజయ్ రీమిక్స్ చేయడం జరిగింది. ఈ రెండు చిత్రాల విజయ్ కెరీయర్ని మలుపు తిప్పాయి. ముఖ్యంగా మహేష్ బాబు డైలాగులతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. హాలీవుడ్ హీరోల కటౌట్ ని కలిగి ఉంటారు.
తన తండ్రి కృష్ణ దర్శకత్వంలో ఐదు సినిమాలు మహేష్ బాబు నటించారు. మహేష్ బాబు సినీ కెరీర్నే మలుపు తెప్పిన చిత్రాలు చాలానే ఉన్నాయి. మహేష్ బాబు ఎప్పుడు కూడా ఇతర హీరోల లాగా ఆలోచించరు తన తండ్రి లాగానే ఎప్పుడు కష్టపడే సినిమా కథ లని ఎంచుకుంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీకి సరికొత్త కథనాన్ని పరిచయం చేయడానికి కూడా వెనుకాడరు. ఎన్నో అవార్డులను రివార్డులను కూడా అందుకున్నారు. మహేష్ బాబు. యుఎస్ లో మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించిన టాప్ 10 చిత్రాలు మహేష్ బాబు వి కలిగి ఉన్నాయి. ఇ రికార్డులు ఏ హీరో ఇంతవరకు చరపలేదు. అలాగే నాన్ బాహుబలి రికార్డులు సాధించిన 100 కోట్ల రూపాయలకు పైగా క్రాస్ సాధించిన చిత్రాలు ఆరుకు పైగా ఉన్నాయి.. అంతేకాకుండా ఎక్కువ నంది అవార్డులను అందుకున్న హీరోగా కూడా పేరు సంపాదించారు.