శోభిత - చైతు పెళ్లి తేదీ ఇదే...!?
టాలీవుడ్ హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతూ మరో హీరోయిన్‌పై మనసు పారేసుకున్నారనే ట్రోల్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే శోభితతోనే చైతూ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. శోభితా, చైతూ ఎంగేజ్మెంట్కు కేవలం వారి రెండు కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. ఎంగేజ్మెంట్ తర్వాత చై-శోభితా మ్యారేజ్ డేట్‌ను కూడా నాగార్జున ప్రకటించేశారని తెలుస్తోంది. ప్రస్తుతం చైైతూ పెళ్లి తేదీ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వచ్చేనెల అంటే సెప్టెంబర్ 20వ తేదీలోపు నాగచైతన్య, శోభితా పెళ్లి జరుగుతుందని కింగ్ నాగార్జున చెప్పేశారట. ఇప్పుడు ఈ విషయంపైనే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి చైతూ, శోభితల పెళ్లిని కింగ్ నాగార్జున గ్రాండ్‌గా జరిపించాలనుకుంటున్నారట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే పెళ్లి తేది ఎంత వరకూ వాస్తవమో తెలియడం లేదు. అక్కినేని నాగార్జున స్వయంగా చైతూ పెళ్లి తేదీని ప్రకటించే వరకూ దీనిపై క్లారిటీ రాదు. టాలీవుడ్లో కూడా దీనిపై చర్చలు గుప్పుమంటున్నాయి. మొత్తానికి ఒంటరిగా ఉన్న నాగచైతన్య మరోసారి ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసి ఆయన అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.