అనసూయ, జగపతి బాబు సింబా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కథ: అక్ష (అనసూయ) ఒక స్కూల్ టీచర్ గా పని చేస్తూ ఉంటారు అయితే ఒక రోజు ప్రమాదంలో తన భర్త రెండు కాళ్లు పోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈమె ఇంటి బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంటారు. ఇలా స్కూల్ టీచర్ గా పని చేస్తున్న అనసూయకు రోడ్డుపై ఒక రోజు ఒక వ్యక్తిని చూడగానే తన మైండ్ లో ఏదేదో జరుగుతూ ఉంటుంది. దీంతో ఆమె ఆ వ్యక్తినే ఫాలో అవుతూ చంపేస్తుంది. ఇలా ఈ కేసును అనురాగ్ (వశిష్ట సింహ) జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్ )ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకరోజు అక్ష షాపింగ్ మాల్ కి వెళ్ళక అక్కడ ఒక వ్యక్తిని చూసి ఈమె ఫాజిల్ తనని ఫాలో అవుతూ చంపేస్తారు. వీరిద్దరూ పార్థ మనుషులు కావటం విశేషం. ఇక వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకు వెళ్తుండగా పార్థ తమ్ముడు వీరిపై అటాక్ చేస్తారు. అయితే డాక్టర్ తో కలిసి అక్ష ఫాజిల్ ముగ్గురు పార్థ తమ్ముడిని చంపేస్తారు. ఇలా ఈ ముగ్గురు మైండ్ లో ఏం జరుగుతుంది ఎందుకు వీళ్ళు పార్థ మనుషులనే టార్గెట్గా చంపుతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
నటీనటుల నటన: అనసూయ తన నటనతో ఎప్పటిలాగే ప్రేక్షకులను మెప్పించారు. స్కూల్ టీచర్ గా ఎంతో అద్భుతంగా నటించడమే కాకుండా మరోవైపు యాక్షన్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించారు. ఇక వసిష్ఠ సింహ మాత్రం పోలీస్ ఆఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. శ్రీనాథ్ పర్వాలేదనిపించాడు. జగపతి బాబు కూడా తన నటనతో మెప్పించారు.
టెక్నికల్: దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈయన టెక్నికల్ టీం నుంచి తనకు కావాల్సింది రాబట్టడంలో పూర్తిగా సక్సెస్ అయి సినిమాని తెరపై అద్భుతంగా చూపించారు. కెమెరా విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది నిర్మాతలు కూడా ఎక్కడ కూడా కాంప్రమైస్ కాకుండా ఈ సినిమా కోసం ఖర్చులు చేశారు.
విశ్లేషణ: సినిమా మాములుగా ఒక రివెంజ్ స్టోరీ అయినా దానికి సెల్యులర్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో తీసుకువచ్చారు ముఖ్యంగా మొక్కలు నాటాలి పర్యావరణాన్ని రక్షించాలి అని ఒక సందేశాన్ని తీసుకువచ్చారు. ఇక సినిమా కథ మొదలైన కొంత సమయానికి కథలోకి వెళ్లి పోతాము కానీ ఇందులో ఎందుకు అనసూయ అలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలు అందరికీ ఆసక్తి కలుగుతాయి సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు అనిపించింది. ఏది ఏమైనా మొత్తానికి ఒకసారి కొత్త సినిమాని పర్యావరణాన్ని కాపాడాలి అన్న కాన్సెప్ట్ తో మంచిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
బాటమ్ లైన్: సినిమా సెల్యులర్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు మొక్కలు మనకు ఎంత అవసరమనే విషయాన్ని అద్భుతంగా చూపించారు.
రేటింగ్ 3/5