నాగచైతన్య - శోభిత.. మొదటిసారి ఎక్కడ కలిశారో తెలుసా?
ఇక విడాకుల తర్వాత ఎవరు కెరీర్ లో వాళ్ళు బిజీగానే ఉన్నారు. విడాకులు తీసుకున్న మళ్లీ వీరిద్దరూ కలుస్తారేమో అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా అక్కినేని హీరో నాగచైతన్య ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి విదేశీ ట్రిప్పులకు వెళుతూ ఉండడం లాంటి ఫోటోలు కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వీరి రిలేషన్షిప్ కన్ఫామ్ అయిపోయింది.
అయితే ఇప్పుడు శోభిత దూళిపాళ్ల నాగచైతన్యలకు ఎంగేజ్మెంట్ జరిగిన నేపథ్యంలో అసలు వీరిద్దరికీ మొదటి పరిచయం ఎక్కడ జరిగింది. అనే విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే 2021 లో సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య కొంతకాలం సింగిల్ గానే ఉన్నాడు. అయితే 2022లో మేజర్ ప్రమోషన్లలో శోభితను తొలిసారి కలిసాడట చైతన్యా. ఇక ఆ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత చైతు ఆమెకు తన కొత్త ఇంటిని చూపించడం.. ఇద్దరు ఒకే కారులో కనబడటంతో.. రిలేషన్ షిప్ లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. 2023లో లండన్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో.. వీరితో రిలేషన్షిప్ కన్ఫామ్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది.