టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నాగచైతన్య సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే.. చైతు తన అభిమానులకి తాజాగా సడన్ షాక్ ఇచ్చాడు.. హీరో నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల. నిన్న (ఆగస్టు 8) ఇరుకుంటుంబీకుల సమక్షంలో చై-శోభితా సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. లైట్ పింక్ కలర్ శారీ కట్టుకుని, తలలో ఆరెంజ్ రంగు పువ్వులు పెట్టుకుని చాలా సింపిల్ లుక్ శోభితా.. వైట్ పంచా ధరించి నాగచైతన్య అక్కినేని ఫ్యాన్స్‌ను
ఆకట్టుకున్నారు. వీరి ఫొటోలను ముందుగా నాగార్జున నెట్టింట పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. శోభితా.. చైతూ చేయి పట్టుకుని భుజం మీద తల వాల్చి ఉన్న ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై కొందరు అతడికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరూ అతడిని విమర్శిస్తున్నారు. అంతేకాదు తాజాగా నాగ చైతన్య ఒక ప్లే బాయ్ అంటూ తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రానా హోస్ట్ చేసిన నెం.1. యారి ప్రోగ్రామ్‌కి వెళ్లిన నాగ చైతన్యను రానా నీ ఫస్ట్ కిస్ గురించి చెప్పు అంటాడు. దీనికి నాగా చైతన్య సమాధానమిస్తూ..
9వ క్లాస్‌లో ఒక అమ్మాయికి ముద్దు పెట్టాను అంటాడు. దీనికి పక్కనున్నా సుమంత్ షాక్ అవ్వగా.. రానా చూడడానికి ఇంత అమాయకంగా ఉన్నావ్ కదరా అంటాడు. దీనికి చైతూ.. రిప్లయ్ ఇస్తూ.. అమాయకంగా ఉండడమే నాకు ప్లస్ అయ్యింది. రానా నీ ఫస్ట్ కిస్ ఎప్పుడురా 4వ క్లాస్‌లోనా అంటాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇకపోతే సమంతకు 2021లో విడాకులు ఇచ్చిన నాగ చైతన్య మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు..!!