తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది దర్శకులు బాలీవుడ్ ఇండస్ట్రీ పై తమ ఇంట్రెస్ట్ ను చూపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా చాలా మంది దర్శకులు ఇప్పటి వరకు తెలుగు లో మంచి విజయం సాధించిన చాలా సినిమాలను హిందీ లో రీమేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే తెలుగులో విజయం సాధించిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుందాం అనుకున్న చాలా మంది దర్శకులకు ఎదురు దెబ్బ తగిలింది. అందులో దాదాపు ఈ మధ్య కాలంలో సందీప్ రెడ్డి వంగ ఒక్కడే సక్సెస్ కాగలిగాడు.
ఈయన కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా అర్జున్ రెడ్డి అనే మూవీ ని తెలుగులో రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత ఇదే సినిమాను ఈయన కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా హిందీలో రీమేక్ చేశాడు. ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయి రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈయనకు సూపర్ సాలిడ్ గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ మూవీ ని రూపొందించి మరో విజయాన్ని కూడా అందుకున్నాడు.
టాలీవుడ్ యువ దర్శకులు అయినటువంటి శైలేష్ కొలను హిట్ ది ఫస్ట్ సినిమాతో మంచి విజయాన్ని తెలుగులో అందుకొని ఆ సినిమాను హిందీ లో కూడా హిట్ ది ఫస్ట్ కేస్ అనే పేరుతో రీమిక్ చేయగా ఆ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక గౌతమ్ తిన్ననూరి , నానితో జెర్సీ అనే బ్లాక్ బాస్టర్ మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమాను హిందీలో జెర్సీ అనే టైటిల్ తో షాహిద్ కపూర్ హీరోగా రూపొందించగా ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలా ఈ మధ్య కాలంలో సందీప్ రెడ్డి వంగ ఒక్కడే తెలుగులో హిట్ అయిన మూవీని హిందీ లో రీమేక్ చేసి సక్సెస్ అయ్యాడు.