ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడు.. రాజమౌళి..!

frame ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడు.. రాజమౌళి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన హిట్ కాంబినేషన్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్లో మొదటగా స్టూడెంట్ నెంబర్ 1 అనే మూవీ రూపొందింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతోనే రాజమౌళి దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో సింహాద్రి అనే మూవీ రూపొందింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో యమదొంగ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

కొంత కాలం క్రితమే వీరి కాంబోలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ కూడా దక్కింది. ఇకపోతే చాలా రోజుల క్రితం ఎస్ ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా మీరు జూనియర్ ఎన్టీఆర్ తో చాలా సినిమాలను తెరకెక్కించారు. కానీ ఆయన యమదొంగ సినిమా తర్వాత చాలా కష్టాలను సినిమాల పరంగా ఎదుర్కొన్నాడు కదా అనే ప్రశ్న ఎదురైంది. దానికి రాజమౌళి సమాధానం ఇస్తూ ... ఎన్టీఆర్ హీరోగా నేను చాలా సినిమాలను చేశాను.

కాకపోతే ఆయనకు యమదొంగ సినిమా కంటే కూడా సింహాద్రి తర్వాత చాలా కష్టాలు వచ్చాయి. సింహాద్రి సినిమా వల్ల ఒక్క సారిగా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోయింది. దాని తర్వాత ఆయన ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపాడు. అందులో భాగంగా ఆయన అనేక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఆ సినిమాలు ఏమీ కూడా సింహాద్రి స్థాయిలో ఆడలేదు. సింహాద్రి మూవీ తర్వాత ఎన్టీఆర్ కు చాలా ఫ్లాప్ లు వచ్చాయి. అలా ఆయన ఆ సినిమా తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు అని రాజమౌళి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: