ప్రేమమ్, ఫిదా సినిమాలతో అందరినీ మనసు దోచేసిన సాయిపల్లవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. నెట్టింట ఈ భామకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది సాయి పల్లవి. అయితే ప్రస్తుతం ఈ భామ కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా వర్ష సినిమాలు చేస్తుంది. అలాగే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యాం సింగారాయి సినిమాలో హీరోయిన్గా నటించిన సాయి పల్లవి అయితే ఈ సినిమాతో తను బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో
విరాటపర్వం తర్వాత సినిమానే చేయలేదు సాయిపల్లవి. ఆ తర్వాత గార్గిలో కనిపించినా, అది డబ్బింగ్ సినిమానే. 2022 తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నో ఆన్సర్. పోనీ, పొరుగు భాషల్లో తీరిక లేకుండా ఉన్నారా? అంటే అలాంటిదేమీ లేదు. అక్కడా రిలీజులు కనిపించడం లేదు. ఆల్రెడీ చేస్తున్న తమిళ అమరన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. తండేల్ ఈ ఏడాది డిసెంబర్లో ఉంటుందా? అంటే ఇప్పటికీ డౌటే. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇప్పుడెక్కడుందో తెలుసా..? ఈ బ్యూటీ ముంబైకి వెళ్లింది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివకార్తికేయన్
నటిస్తోన్న తాజా చిత్రం అమరన్ . దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు. తమిళంతోపాటు పలు ప్రధాన భాషల్లో అక్టోబర్ 31న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో అమరన్కు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది. సాయిపల్లవి స్టూడియోలో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. అమరన్‌లో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ విలన్‌గా నటిస్తున్నాడు. శివకార్తికేయన్ రక్తపు మరకలతో కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో జాతీయ జెండా ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది...!!