కార్తికేయ 3 నుంచి బిగ్ అప్డేట్.. ఆ రోజే స్పెషల్ అనౌన్స్మెంట్..?

frame కార్తికేయ 3 నుంచి బిగ్ అప్డేట్.. ఆ రోజే స్పెషల్ అనౌన్స్మెంట్..?

murali krishna
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ - దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‍లో వచ్చిన కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మైథాలజీతో మిస్టరీ థ్రిల్లర్లుగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రం ‘సుబ్రమణ్యపురం’ గ్రామం మిస్టరీ కథతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. ఇక 2022లో వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్‍లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లను కైవసం చేసుకుంది. శ్రీకృష్ణుడి అంశంతో మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన కార్తీకేయ 2 సూపర్ హిట్ అయింది.కార్తికేయ 3 సినిమా ఉంటుందని రెండో పార్ట్ క్లైమాక్స్‌లోనే మూవీ టీమ్ సంకేతాలు ఇచ్చింది. అయితే, అప్పటి నుంచి ఈ చిత్రంపై పెద్దగా అప్‍డేట్స్ రాలేదు. దీంతో కార్తికేయ 3 ఎప్పుడు ఉంటుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోఈ చిత్రాన్ని బొగ్గారపు శ్రీనివాస్‌ నిర్మించారు. అయితే ఈ చిత్రం విజయం సాధించడంతో ఈ చిత్రం సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు చందు మొండేటి, నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తీకేయ-2ను అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది.అయితే కార్తికేయ-2 నిర్మించడానికి నేనే వారికి హక్కులు ఇచ్చానని, ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌, ఫ్రాంచైజీ హక్కులు తన వద్దనే వున్నాయని అంటున్నాడు నిర్మాత బొగ్గారపు శ్రీనివాస్‌. మరోవైపు కార్తికేయ-3 హక్కులు తమ వద్ద వున్నాయని అప్పట్లో ప్రకటించారు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌.
దీనిపై గురువారం బొగ్గారపు శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. కార్తికేయ మొదటిభాగం విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబరులో విజయదశమి పర్వదినాన కార్తికేయ-3ను అధికారికంగా ప్రకటిస్తాను అంటున్నారు. కార్తికేయ-2 సంచలన విజయం సాధించడంతో వచ్చే ప్రీక్వెల్‌పై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే వారి అంచనాలకు అందుకునేటట్లుగా కథ విషయంలో, స్క్రిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, దీంతో పాటు తను డివోషనల్‌ టచ్‌ వున్న ఓ కథతో హనుమంతుడి ప్రేరణతో యతి అనే సినిమాను, శివుడి స్పూర్తితో మహాయోగి అనే మరో డివోషనల్‌ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నానని ఆయన తెలిపారు. అయితే ఈ నిర్మాత ఇచ్చిన ఈ ప్రకటనతో హీరో నిఖిల్‌, దర్శకుడు, చందు మొండేటి, కార్తికేయ-2 నిర్మించిన నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.ప్రస్తుతం కార్తికేయ 3 చిత్రానికి స్క్రిప్ట్‌ పనుల్లో చందూ మొండేటి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‍గా, ఎక్కువ బడ్జెట్‍తో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. రెండో భాగం పాన్ ఇండియా రేంజ్‍లో హిట్ అవడంతో కార్తికేయ 3 మూవీని భారీగానే తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా తండేల్ చిత్రాన్ని ప్రస్తుతం రూపొందిస్తున్నారు చందూ మొండేటి.స్వయంభూ సినిమాలో ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అంచనాలను భారీగా పెంచేసింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాజుల కాలం నాటి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: