రకుల్ డెసిషన్ కి ఫీల్ అవుతున్న ఫ్యాన్స్.. అలా చేసి మిస్టేక్ చేసిందా..?

frame రకుల్ డెసిషన్ కి ఫీల్ అవుతున్న ఫ్యాన్స్.. అలా చేసి మిస్టేక్ చేసిందా..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగులో మంచి అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో అనేక మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. రకుల్ స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలో చాలా శాతం కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో, , నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈమె కెరియర్ చాలా సాఫీగా తెలుగు సినీ పరిశ్రమలో ముందుకు సాగింది.

ఇక తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తూ వరుస అవకాశాలు దక్కుతున్న సమయంలో తమిళ్ , హిందీ సినీ పరిశ్రమలపై ఇంట్రెస్ట్ ను చూపడం మొదలు పెట్టింది. ఈమె తెలుగులో ఆఖరుగా కొండపొలం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తర్వాత రకుల్ ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలు నటించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తమిళ , హిందీ సినిమాలలోనే నటిస్తూ వస్తుంది. కాకపోతే ఈమెకు తమిళ్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన అవి ఏవి గొప్ప విజాయలను అందుకోలేదు.

అలాగే హిందీ లో కూడా ఈమెకు చెప్పుకోదగ్గ భారీ విజయాలు దక్కలేదు. దానితో ఈమె ఫ్యాన్స్ తెలుగు లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలో ఈమె తమిళ్ , హిందీ పరిశ్రమలపై ఇంట్రెస్ట్ చూపాలి అనే డెసిషన్ తీసుకోకపోయి ఉంటే బాగుండేది అని , ఆమె ఆ విషయంలో పెద్ద మిస్టేక్ చేసింది , ఆమె తెలుగులోనే కెరియర్ కొనసాగిస్తే ఆమె ఇప్పటికీ కూడా టాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ను కొనసాగిస్తూ ఉండేది అని ఆమె అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: