ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కొంత కాలం క్రితం ఈస్మార్ట్ శంకర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీని రామ్ పోతినేని హీరోగా కావ్య దా హీరోయిన్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ , చార్మి ఇద్దరు కలిసి నిర్మించారు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి అనేక పాటలను , ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇస్మార్ట్ శంకర్ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. ఆ సినిమా విజయంలో ఆయన అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇక డబల్ ఇస్మార్ట్ మూవీ కి కూడా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉండబోతున్నట్లు , ఈ ట్విస్ట్ తోనే సినిమా రేంజ్ పెరగబోతున్నట్లు , దాదాపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమాలోని ట్విస్ట్ రేంజ్ లో ఈ మూవీలో కూడా ఓ ట్విస్ట్ ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే డబల్ ఇస్మార్ట్ మూవీ కి కొనసాగింపుగా మరో సినిమా ఉండే విధంగా కూడా ఈ సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పూరి జగన్నాథ్ "డబల్ ఇస్మార్ట్" మూవీ క్లైమాక్స్ లో అనేక ట్విస్టులను రెడీ చేసినట్లు తెలుస్తోంది.