మహేష్ కు తారక్ స్పెషల్ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్..!!

frame మహేష్ కు తారక్ స్పెషల్ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్..!!

murali krishna
సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన రోజు నేడు (ఆగ‌స్టు 9). ఈ రోజు ఆయ‌న 49 ప‌డిలో అడుగుపెట్టాడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు, నెటిజ‌న్లు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇంకోవైపు మురారి రీ రిలీజ్‌తో థియేట‌ర్ల‌లో సంద‌డి నెల‌కొంది.ఈ నేప‌థ్యంలోనే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.యంగ్ టైగర్ బిరుదుతో పాపులర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు అవసరంలేదు. అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరో అయ్యారు. తన నటనతో, నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో నవరసాలు పోషించగలిగేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అని చెప్పొచ్చు.ఈ నేప‌థ్యంలోనే  సోషల్ మీడియా లో మహేష్ కు తారక్ "పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్ అన్న ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను". అని పోస్ట్ చేశారు.మహేష్ తరపున ఆయన ఫ్యాన్స్ వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను పెట్టి తారక్ కు థాంక్స్ చెబుతున్నారు సూపర్ స్టార్ యంగ్ టైగర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేప‌థ్యంలోనే  మహేష్ బాబు బర్త్ డేకి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఓ వైపు సోషల్ మీడియాలో అభిమానులు మహేష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతుంటే.. మరోవైపు థియేటర్స్‌లో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మురారి సందడి చేస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కాగా మురారి థియేటర్ లో ఓ ఫ్యాన్ జంట పెళ్లి కూడా చేసుకున్నారు. అలాగే కొన్ని థియేటర్స్ లో అక్షింతలు కూడా చల్లుతూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.మ‌హేశ్ కుమారుడు గౌత‌మ్‌, సూప‌ర్ స్టార్ గారాల ప‌ట్టి సితార లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తండ్రికి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు.గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టించ‌నున్నారు. ఈ మూవీ కోసం మ‌హేశ్ జుట్టు, బాడీ పెంచి లుక్ మార్చుకునే ప‌నిలో ఉన్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ర్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెడతారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: