ఆ అకౌంట్ ద్వారా బూతులు తిట్టేది హరీష్ శంకరేనా.. దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చాడుగా..?
ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక ఫేక్ అకౌంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాములుగా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ సూపర్ యాక్టివ్‌గా ఉంటాడు. ఫ్యాన్స్ చేసిన కామెంట్స్‌కి రిప్లై ఇస్తుంటాడు. సినిమాలకి సంబందించిన ఎన్నో అప్‌డేట్స్ కూడా షేర్ చేస్తాడు. అంతేకాదు తన గురించి తన సినిమా గురించి ఎవరైనా విమర్శలు చేస్తే వారికి దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తుంటాడు.
అయితే హరీష్ శంకర్ కంటే ముందు, ఆయన్ను ఎవరైనా పల్లెత్తు మాట అనగానే వెంటనే ఒక అకౌంటు విరుచుకు పడిపోతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి హరీష్ శంకర్ గురించి చెడుగా మాట్లాడితే ఆ వ్యక్తిపై ఈ అకౌంట్ ద్వారా షాకింగ్ కౌంటర్లు పడిపోతాయి. కొద్దిగా అబ్యూజింగ్ భాషలో ఈ కౌంటర్ అటాక్ సాగుతుంది. ఆ అకౌంట్ కూడా హరీష్ శంకరిదే అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు.
హరీష్ శంకర్ దీనిని ఒక సెకండరీ, బ్యాకప్ అకౌంట్‌గా చూస్తే యూస్ చేస్తున్నాడేమో అని నమ్ముతుంటారు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ తన ఇంటర్వ్యూలో హరీష్ శంకర్‌ని అడిగారు. "హరీష్ శంకర్ గారు మీకు ఆల్టర్నేటివ్ ట్విట్టర్ అకౌంట్ ఉందని ఒక ప్రచారం జరుగుతోంది దానిపై మీరు ఏమంటారు?" అని క్వశ్చన్ చేశాడు. దానికి హరీష్ చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు.
"నేను ఎవరినైనా విమర్శించాలంటే డైరెక్ట్ గానే విమర్శిస్తా. ఎవరికైనా జవాబు ఇవ్వాలంటే డైరెక్ట్ గానే చెబుతా. డొంక తిరుగుడుగా మాట్లాడను. నేను ఎవరికీ భయపడను ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడతా. ఆ విషయం ఇండస్ట్రీలో ఎవరు అడిగినా చెప్తారు. నేను ఆల్టర్నేటివ్ అకౌంట్ పెట్టుకొని విమర్శలు చేసే రకం కాదు. ఆ అకౌంట్ నా ఫ్యాన్‌ది. నేనోసారి అతనితో మాట్లాడటం జరిగింది. ఎవరైనా అబ్యూజింగ్‌గా మాట్లాడితే అదే డర్టీ లాంగ్వేజ్ మనం వాడాల్సిన అవసరం లేదని కూడా అతడికి సలహా ఇచ్చా." అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.