అతనెవరబ్బా.. ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్న కీర్తి సురేష్ ఫ్యాన్స్?
అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ ఇలా రిలేషన్షిప్ విషయంలో ఎక్కువగా రూమర్లు ఎదుర్కోని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే.. అది కీర్తి సురేష్ అని చెప్పాలి. కెరియర్ మొదటి నుంచి కూడా ఈ అమ్మడు ప్రేమ పెళ్లి వ్యవహారం పై వచ్చిన రూమర్స్ మిగతా హీరోయిన్లతో పోల్చి చూస్తే చాలా తక్కువే. ఇప్పటికీ కూడా కీర్తి సురేష్ ఎవరితో రిలేషన్షిప్ లో లేదని.. సింగిల్ గానే ఉంటుంది అంటూ ఎంతో మంది అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. అయితే ఇలా కీర్తి సురేష్ సింగిల్ అనుకునే అభిమానులందరికీ కూడా ట్విస్ట్ ఇచ్చింది ఈ హీరోయిన్.
తాను సింగిల్ కాదు అంటూ ఇటీవల బాంబు పేల్చింది. ఇక కీర్తి సురేష్ మాటలు విని ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇటీవలే ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొంది కీర్తి సురేష్. అయితే చాలామంది మీరు సింగిల్ అనుకుంటున్నారు అని యాంకర్ అడగగా.. తాను సింగిల్ అని ఎప్పుడూ చెప్పలేదు కదా అంటూ కీర్తి సురేష్ బాబు పేల్చింది. దీంతో యాంకర్ కూడా షాక్ అయింది. చాలు ఈమాత్రం హింటిస్తే చాలు అంటూ అటూ యాంకర్ ఆ తర్వాత ఈ టాపిక్ ని డైవర్ట్ చేసింది. ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కీర్తి మాట్లాడుతూ.. కెరియర్ ఆరంభంలో సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న. కానీ మహానటి సినిమా తర్వాత నాపై వచ్చే ట్రోల్స్ తగ్గాయి. కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ పెడతారు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది అంటూ కీర్తి సురేష్ కామెంట్ చేసింది.