ఆ సినిమా కోసం విజయ్ ఆరు నెలల కఠిన కష్టం అలా వృధా..?

frame ఆ సినిమా కోసం విజయ్ ఆరు నెలల కఠిన కష్టం అలా వృధా..?

Pulgam Srinivas
కొంత మంది హీరోలు సినిమా కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా మంది హీరోలు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆ మూవీ ని విజయం వైపు తీసుకు వెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. తమకు ఎంతో కష్టం అయిన సన్నివేశాలలో కూడా నటిస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది హీరోలు కథ చెప్పిన తర్వాతే దానికి అనుగుణమైన బాడీ కోసం , వేషధారణ కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి విజయ్ దేవరకొండ కూడా ఒక సినిమా విషయంలో చాలా కష్టపడ్డాడు.

కానీ తీరా చూస్తే ఆ సినిమా మాత్రం ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఏది ..? అసలు ఆయన ఎంతలా కష్టపడ్డాడు అనే వివరాలను తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం లైగర్ అనే బాక్సింగ్ నేపథ్యం కలిగిన సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించగా ... మైక్ టైసన్ ఈ మూవీ లో ఓ ముఖ్య పాత్రలో నటించాడు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించాలి కాబట్టి ఈ మూవీ స్టార్ట్ కావడానికి దాదాపు 6 నెలల ముందే అలాంటి బాడి రావడం కోసం వర్కౌట్లు చేయడం మొదలు పెట్టాడు. అలాగే బాక్సర్ అంటే ఎలా ఉండాలో అలాంటి కరెక్ట్ షేప్ రావడం కోసం ఆరు నెలలు కష్టపడి ఆ లుక్ లోకి ఆయన వచ్చి సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఆ సినిమా కోసం విజయ్ ఎంతో కష్టపడ్డాడు. ఇక మంచి అంచనాల నడుమ సినిమా విడుదల అయ్యింది. కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాశయాన్ని ఎదుర్కొంది. అలా దాదాపు 6 నెలల పాటు సినిమా కోసం విజయ్ కష్టపడగా ఆ సినిమా మాత్రం ఆయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: