నందమూరి హీరోల్లో త్రిపాత్రాభినయం చేసింది వీరే.. ఏ సినిమాల్లోనో తెలుసా..?

frame నందమూరి హీరోల్లో త్రిపాత్రాభినయం చేసింది వీరే.. ఏ సినిమాల్లోనో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమ లో ఎక్కువ శాతం త్రిపాత్రాభినయం లో నటించిన హీరోలలో నందమూరి హీరో లు ఉన్నారు . నందమూరి తారక రామారావు తన కెరీర్ లో చాలా సినిమాలలో త్రిపాత్రాభినయంలో నటించి మెప్పించాడు . సీనియ ర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో కుల గౌరవం , దాన వీర శూర కర్ణ , శ్రీ కృష్ణ సత్య , శ్రీమద్ విరాటపర్వం , వీర బ్రహ్మేంద్ర చరిత్ర ఇలా ఎన్నో సినిమాలలో త్రిపాత్రాభినయం లో నటించి తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు అయినటువంటి బాలకృష్ణ కూడా త్రిపాత్రాభినయం లో నటించాడు.

ఈయన కొన్ని సంవత్సరాల క్రితం అధినాయకుడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ మూడు పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో మూడు పాత్రలలో నటించి తన నటనతో బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ వంశానికి చెందిన మరో హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం జై లవకుశ అనే సినిమాలో త్రిపాత్రాభినయంలో నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇదే వంశానికి చెందిన మరో నటుడు కళ్యాణ్ రామ్ కూడా అమిగొస్ అనే సినిమాలో త్రిపాత్రాభినయం లో నటించాడు. ఇక కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: