అందంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోన్న ఐశ్వర్య రాజేష్

Suma Kallamadi
ఐశ్వర్య రాజేష్.. తెలుగు అమ్మాయే అయినా తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధిస్తోంది. ఎప్పుడూ చీరలో కనిపించే ఈ అమ్మడు తాజాాగా తన ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అందంతో కట్టిపడేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా మోడ్రన్ ఔట్‌ఫిట్‌లో ఉన్న ఐశ్వర్య రాజేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌కు ఐశ్వర్య రాజేష్ కేరాఫ్ అడ్రస్ అని అందరూ చెబుతుంటారు. ఆమె ఎప్పుడూ హీరోయిన్ పాత్రలే కాకుండా డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటుది. అందుకే ఐశ్వర్య రాజేష్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంది.
సినిమాల్లో పద్దతిగా కనిపించే ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు గ్లామర్ డోస్‌ను పెంచుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మోడ్రన్ డ్రెస్‌లో హాట్‌గా ఉన్న ఆమె ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఐశ్వర్య లేటెస్ట్ లుక్స్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. కౌసల్య కృష్ణమూర్తి అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..అంతకుముందు కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రజలకు చేరువైంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటించింది. ఈ మూవీలో తన సహజ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందులో కూడా సంప్రదాయంగానే కనిపించింది.
తాజాగా ఐశ్వర్య రాజేష్.. గ్లామర్ డోస్ పెంచేసి మోడ్రన్ డ్రెస్సులో కనిపించింది. ఆమె ఫోటోలను చూసిన యువతకు మైండ్ బ్లాంక్ అవ్వక తప్పదు. బ్లాక్ డ్రెస్‌లో కోర చూపులతో ఐశ్వర్య లుక్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం ఆమె లుక్స్‌పై, గ్లామర్ ఫోటో షూట్‌పై సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరేమో అవకాశాల కోసమే ఐశ్వర్య ఇలా హాట్ ఫోటో షూట్స్ చేస్తోందని చెబుతున్నారు. 1990లో జన్మించిన ఈమె మొదట సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: