డబల్ ఇస్మార్ట్ కోసం ఎప్పుడు చేయని రిస్క్ చేస్తున్న పూరి.. వర్కౌట్ అయ్యేనా..?

frame డబల్ ఇస్మార్ట్ కోసం ఎప్పుడు చేయని రిస్క్ చేస్తున్న పూరి.. వర్కౌట్ అయ్యేనా..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో ఒక్కో డైరెక్టర్ మి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొంత మంది డైరెక్టర్లు సినిమా తీశారు అంటే ఆ సినిమాల రన్ టైమ్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొంత మంది దర్శకులు ఏకంగా మూడు గంటలు కనీసం లేదా దాని దగ్గర నిడివితోనే సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఇకపోతే మరి కొంత మంది దర్శకులు మాత్రం చాలా తక్కువ రన్ టైమ్ తో తమ సినిమాలు ఉండడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలా ఉండడం వల్ల సినిమా కథలో కాస్త దమ్ము తక్కువగా ఉన్న రన్ టైమ్ తక్కువ కాబట్టి ప్రేక్షకులు పెద్దగా నిరుత్సాహపడరు అనే ఉద్దేశంతో రన్ టైమ్ తక్కువ పెట్టే దర్శకులు కూడా ఉంటూ ఉంటారు.

తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ రన్ టైమ్ తో సినిమాలను తెరకెక్కించే దర్శకులలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈ దర్శకుడు కెరియర్ ప్రారంభంలో కాస్త ఎక్కువ రన్ టైమ్ తో ఉన్న సినిమాలను తెరకెక్కించిన ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన చాలా తక్కువ నడివితోనే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు రెండున్నర గంటల నిడివి లోపే ఉన్నాయి. మరికొన్ని సినిమాలు అయితే 2 గంటల 15 నిమిషాలు 20 నిమిషాల నిడివిలో ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి.

తాజాగా పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విషయంలో మాత్రం పూరి జగన్నాథ్ తన రూట్ ను మార్చాడు. ఈ మూవీ ని భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ఏకంగా  2 గంటల 42 నిమిషాల భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని పూరి జగన్నాథ్ చూస్తున్నట్లు తెలుస్తోంది. కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: