రవితేజ గురించి నాకు మొత్తం తెలుసు.. అతను అలా పైకి వచ్చాడు.. వైవిఎస్ చౌదరి..!

frame రవితేజ గురించి నాకు మొత్తం తెలుసు.. అతను అలా పైకి వచ్చాడు.. వైవిఎస్ చౌదరి..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వై వి ఎస్ చౌదరి ఒకరు. ఈయన సీతారాముల కళ్యాణం అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని తెలుగులో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోలతో కూడా సినిమాలను తెరకెక్కించాడు. ఎక్కువ శాతం వై వి ఎస్ చౌదరి , హరికృష్ణ హీరో గా రూపొందిన సినిమాలకు దర్శకత్వం వహించాడు.

అలాగే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన ఒక్క మగాడు సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఆఖరుగా ఈ దర్శకుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన రేయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఈ సినిమా ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు. ఇకపోతే తాజాగా వై వి ఎస్ చౌదరి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా రవితేజ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

ఆగస్టు 15 వ తేదీన రవితేజ హీరో గా రూపొందిన మిస్టర్ బచ్చన్ తో పాటు రామ్ పోతునేని హీరోగా రూపొందిన డబల్ ఇస్మార్ట్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో వై వి ఎస్ చౌదరి ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రవితేజ గురించి మాట్లాడుతూ ... రవితేజ నా రూమ్మేట్. ఎప్పటికీ నా హృదయంలో ఉంటారు అని అన్నారు. ఎందుకంటే రవితేజ ఎంతో కష్టపడి పైకి వచ్చాడో నాకు తెలుసు. రవితేజ నేను 8 ఏళ్లు ఒకే రూమ్ లో ఉన్నాము అని వై వి ఎస్ చౌదరి తాజాగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: