నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వాల్టేర్ వీరయ్య సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నా బాబి కొల్లి దర్శకత్వంలో ఈయన ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ స్టార్ట్ అయ్యే చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా బాలయ్య కెరియర్ లో 109 వ మూవీ కావడంతో ఈ సినిమాను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు.
ఈ సినిమాకు టైటిల్ న ఫిక్స్ చేయడం పోవడం మాత్రమే కాకుండా , ఈ సినిమా షూటింగ్ చాలా బాగా పూర్తి అయిన ఇప్పటి వరకు ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించలేదు. దానితో ఈ మూవీ విడుదల తేదీ పై అనేక వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కాకపోతే డిసెంబర్ నెలలో పుష్ప మరియు గేమ్ చేంజర్ సినిమాలు ఇప్పటికే విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి.
ఇక సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆ సీజన్ లో కూడా అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇక ఎటు చూసినా అక్టోబర్ నెలలో మాత్రమే పెద్దగా కాంపిటేషన్ లేదు. మరి పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో భగవంత్ కేసరి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన బాలయ్య ఈ సారి కూడా అదే సీజన్ లో వస్తాడా లేక డిసెంబర్ లేదా సంక్రాంతి సీజన్ కు వచ్చి ఇతర హీరోలతో పోటీపడి సక్సెస్ ను అందుకుంటాడా అనేది చూడాలి.