చాలామంది సినీ సెలబ్రిటీలపై వ్యాపారవేత్తలకు లేదా రాజకీయ నాయకులకు ఇష్టం అనేది ఉంటుంది. అయితే ఇప్పటికే ఇలా చాలామంది సెలబ్రిటీల విషయంలో మనం గమనించాం. అయితే సీనియర్ నటి జయలలిత పై అంబానీ మోజుపడి ఆమె కోసం ఏం చేశారు తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే. అవును ఈ విషయం ఏదో పుకారు కాదు స్వయంగా ఆమె నోటి నుండి ఆమెనే బయట పెట్టిన నిజాలు.మరి జయలలిత అందంపై మోజుపడి అంబానీ ఏం చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. జయలలిత అంటే అందరూ తమిళనాడు సీఎం హీరోయిన్ జయలలిత అనుకుంటారు. కానీ ఆమెపేరుతో ఇండస్ట్రీలో మరో నటి కూడా ఉన్నది.80's లో హీరోయిన్ గా రాణించిన జయలలిత ఆ తర్వాత సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బామ్మ పాత్రల్లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని ధీరుభాయ్ అంబానీ అంటే ముకేశ్ అంబానీ తండ్రి ఎంతగానో ఇష్టపడ్డారట.
జయలలిత సినిమాలు చూసి ముగ్దుడైపోయిన ధీరుభాయ్ అంబానీ ఆమెకి ప్రేమతో ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ ని ఆమె పేరు మీద రాసి ఇచ్చారట. ఇక ముంబై ప్లాట్ మాత్రమే కాదు దుబాయ్ లో ఉండే ఒక మ్యాన్షన్ హౌస్ ని కూడా జయలలితకి రాసిస్తే ఆమె మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేసిందట.ఎందుకంటే పరుల సొమ్ము పాము వంటిది అని దాన్ని రిజెక్ట్ చేసిందట. అయితే అంబానీ ని పెళ్లి చేసుకుంటే నా జీవితం మరోలా ఉండేది. కానీ అంబానీ నా దగ్గర నుండి పెళ్లి,పిల్లల్ని ఆశించలేదు.ఆయన నా దగ్గర నుండి వేరే ఆశించారు. ఆయన కేవలం నా అందాన్ని మాత్రమే ప్రేమించారు. నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. అందుకే ఆయన కి దూరంగా ఉంటూ చాలా రోజులు తప్పించుకొని తిరిగాను.ఇక కొన్ని కొన్ని సందర్భాలలో అయితే నా వెంట పడకండి అని గట్టిగా చెప్పాను.
అయినా కూడా ఆయన నన్ను వదలలేదు అంటూ జయలలిత కరాటే కళ్యాణి నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకుంది. ఇక జయలలిత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది దర్శక నిర్మాతల దగ్గర లొంగాల్సి వచ్చిందని అవకాశాల కోసం ఆ పని చేశాను అంటూ చెప్పింది. అంతేకాకుండా సీనియర్ నటుడు శరత్ బాబుతో కూడా రిలేషన్ ఉండి ఆయనతో పిల్లల్ని కనాలి అనుకున్నానని, కానీ అది కుదరలేదు అంటూ చెప్పింది. ప్రస్తుతం జయలలిత మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అంబానీ లాంటి వాడే జయలలిత అందానికి ముగ్దుడయ్యాడు అంటే ఆ రోజుల్లో జయలలిత ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు