యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేసన్ లో ఓ బిగ్ ప్రాజెక్ట్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే నేడు ఘనంగా వీరి సినిమా ప్రారంభమైంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ లాంఛింగ్ కార్యక్రమం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.ఈ కార్యక్రమానికి అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరూ కుటుంబ సమేతంగా హాజరైయ్యారు. పూజా కార్యక్రమాలతో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై సినిమాను స్టార్ చేశారు. ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి కెమెరా స్విచ్ఛాన్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే #NTRNeel హ్యాష్‌ట్యాగ్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను షురూ చేయనున్నారు. 2026 జనవరి 9న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రిలీజ్ కానుందని మైత్రీ మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇప్పటి వరకు యాక్షన్ చిత్రాలతో అలరించిన ప్రశాంత్ నీల్.. ఈసారి కొత్త జోనర్ లో వెళ్లబోతున్నారు. భిన్నమైన భావోద్వేగాలతో వైవిధ్యభరిత చిత్రంగా ఎన్టీఆర్ 31ను రూపొందించబోతున్నారు. డ్రాగన్ అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలనతో ఉంది.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, నీల్ అంటూ ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అతడి నాయకత్వంలో భూమి కంపిస్తుంది అంటూ పోస్టర్‌కు ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.
2026 జనవరి 9న ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే చెప్పడానికి రిలీజ్ అప్పుడని వేస్తారు కానీ అసలు ఆ డేట్ కి సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుందా అన్న సందేహం మొదలైంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఓ పక్క ఎన్టీఆర్ దేవర 1 ని పూర్తి చేయాల్సి ఉంది. వార్ 2 కూడా లైన్ లో ఉంది. దేవర, వార్ 2 పూర్తి చేసేసరికి ప్రశాంత్ నీల్ సినిమాకు టైం ఇవ్వడం లేట్ అవుతుంది.వేయడానికి పోస్టర్ మీద డేట్ వేశారు కానీ సినిమా అసలు ఆ డేట్ కి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు ఫ్యాన్స్. ఎన్ టీ ఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ రెండు భాగాలు సలార్ 1 తీసిన ప్రశాంత్ నీల్ ఓ పక్క సలార్ 2 ని ఎప్పుడు తీస్తాడా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే సడెన్ గా ఎన్ టీ ఆర్ సినిమా పూజ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేశాక మళ్లీ దేవర 2 కోసం పనిచేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి స్టార్ సినిమాలు ఈ రెండు భాగాల వల్ల పెద్ద తలనొప్పి వచ్చి చేరింది.