ప్లీజ్ మాకు రైస్ సహాయం చేయండి.. రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!
అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ .. పేద పిల్లలకు అండ్ జంతువులకు సహాయం చేస్తుంది . తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా .. తన ఫ్యాన్స్ ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది . అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తలో నిలుస్తుంది కూడా . ఇక ఈ క్రమంలోనే తాజాగా కుక్క పిల్లలకు డొనేషన్ గా రైస్ కావాలంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది .
ఆ పోస్టులో భాగంగా .. అర్జంట్ రిక్వెస్ట్ .. మా కుక్కలకు రేషన్ బియ్యం కావాలి ఎవరైనా మాకు బియ్యం సహాయం చేయగలరా ? ప్లీజ్ మాకు ప్రతి నెల 300 కేజీలు కావాలి . నాలుగు మంది సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రభుత్వం నుంచి 24 కేజీల బియ్యం అందుతుంది . కాబట్టి దయచేసి మీరు మాకు విరాళం ఇవ్వగలరా . అలా 10 కుటుంబాలు ఆయన విరాళం ఇవ్వగలిగితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది . దయచేసి మీ స్నేహితులు మరియు బంధువులతో ఈ విషయాన్ని షేర్ చేయండి ... అంటూ తెలిపింది . కాగా ఆమె 50 కేజీల రైస్ ఇచ్చినట్లు ఆ పోస్ట్ లో పేర్కొంది . ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది .