సమంత రెండో పెళ్లి ఫిక్స్.. మరో రెండేళ్లలో ఆయనకి భార్య..?

frame సమంత రెండో పెళ్లి ఫిక్స్.. మరో రెండేళ్లలో ఆయనకి భార్య..?

Pandrala Sravanthi
ఏంటి సమంత నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుందా.. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమంత కూడా రెండో పెళ్లికి రెడీ అయిందా.. వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఏ మాయ చేసావే అనే మూవీతో నాగచైతన్య మతి పోగొట్టిన సమంత.. మొదటి సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిదిరించింది. అలా వీరి మధ్య ఉన్న ప్రేమని చాలా రోజులు గుట్టుగా ఉంచి ఆ తర్వాత పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి కాంబినేషన్లో ఆటోనగర్ సూర్య, మజిలీ,మనం వంటి సినిమాలు వచ్చాయి. ఇక వీరి కాంబోలో వచ్చిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు బ్లాక్ బస్టర్. అయితే అలాంటి ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకోవడం ఎంతో మందిని బాధించింది.కానీ బ్రహ్మ రాసిన రాత ఎవరూ చెరపలేరు అన్నట్లు వీరి రాత అలాగే ఉంది.అందుకే వీరికి ఏది రాసి పెట్టిందో అదే జరుగుతుంది. 

ఇక తాజాగా నాగచైతన్య శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక ఈ విషయంలో సమంతకు మండిందో ఏమో తెలియదు కానీ తాజాగా సమంత తన అభిమాని పెట్టిన పోస్ట్ కి రిప్లై ఇవ్వడంతో ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.ఇంతకీ సమంత అభిమాని తన సోషల్ మీడియా ఖాతాలో ఏం పెట్టారంటే.. సామ్ నువ్వేమీ బాధపడకు.. నీకు నేనున్నాను.. మరో రెండు సంవత్సరాలలో నేను ఆర్థికంగా స్థిరపడి ఇండిపెండెంట్ గా మారుతాను మనం పెళ్లి చేసుకుందాం.. అంటూ అభిమాని పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అయితే ఈ పోస్ట్ చూసిన సమంత స్వీట్ గా రిప్లై ఇచ్చింది.నీ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న జిమ్  నన్ను ఎంతగానో అట్రాక్ట్ చేసి కన్విన్స్ చేసింది అంటూ రిప్లై ఇవ్వడంతో ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

అంతేకాదు సమంత లాంటి పెద్ద హీరోయిన్ ఆయన పెట్టిన పోస్ట్ కి రియాక్ట్ అవ్వడంతో ఆ వ్యక్తి భూమి మీద ఉండడం లేదనుకోండి. ఎందుకంటే మళ్ళీ తిరిగి పోస్ట్ పెడుతూ.. సమంత రిప్లై నా రోజునే మార్చేసింది. సమంతకి వెయ్యి మంది ఫ్యాన్స్ ఉంటే అందులో నేను ఒకడిని.. అలాగే వంద మంది ఫ్యాన్స్ ఉంటే అందులో కూడా నేను ఉంటాను. ఇక ఒక్కరే అభిమాని ఉంటే ఆ ఒక్కడినే నేనే..ఒకవేళ ఎవరూ లేరు అనుకుంటే అసలు నేను ఈ భూమి మీదనే లేనట్లు అంటూ సమంత పెట్టిన పోస్ట్ కి రియాక్ట్ అవుతూ ఆ అభిమాని పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు చాలామంది చైతన్యకు షాక్ ఇస్తూ సమంత కూడా మరో రెండేళ్లలో ఆ వ్యక్తిని పెళ్లాడబోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: