నాగచైతన్య కంటే ముందే అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన శోభిత..?

Suma Kallamadi
అక్కినేని నాగచైతన్య, బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ శోభిత ధూళిపాళ చాలా సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకుని ఆశ్చర్యపరిచారు. త్వరలోనే పెళ్లి బంధంతో భార్యాభర్తలు కానున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న మూడేళ్లకే శోభితను నాగచైతన్య లవ్ చేయడం ప్రారంభించాడు. అతనికి సమంతని మర్చిపోవడానికి ఒక ఏడాది సమయం పట్టి ఉండొచ్చు. ఆ తర్వాత లైఫ్ లో ఒక తోడు కావాలనుకుని ఉండవచ్చు. అందుకే శోభితను ప్రేమించడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. శోభిత ఈ అఫైర్ ను చాలా సీక్రెట్ గా ఉంచింది. కానీ దాస్తే దాగే విషయం కాదు కదా. వీళ్లు ఫారెన్ ట్రిప్ లో కలిసి ఎంజాయ్ చేస్తూ మన ఇండియన్స్‌ కంటపడ్డారు. వారి ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ఆ రూమర్స్‌ని కూడా శోభిత కొట్టి పారేసింది.

నిశ్చితార్థం తోనే వారి రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా బయటపడింది. చైతూ, శోభిత నాగార్జున ఇంట్లో చాలా దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి. శోభితకు మాత్రం ఫస్ట్ మ్యారేజ్. కానీ ఆమె ఇంతకుముందు ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించింది తర్వాత వారిద్దరూ బ్రేకప్ అయ్యారు. ఆమె లవ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం.

శోభిత‌ మోడల్ కెరీర్ స్టార్ట్ చేసి ఆపై సినిమాల్లో హీరోయిన్గా నటించిన ప్రారంభించింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసేది. అయితే మోడలింగ్ చేసే సమయంలోనే ఆమెకు ప్రణవ్‌ మిశ్రా అనే ఓ ఫేమస్ ఫ్యాషన్‌ డిజైనర్ పరిచయం అయ్యాడు. అతను లగ్జరీ బ్రాండ్‌ హ్యూమన్‌ను కోపౌండ్ కూడా చేశాడు. ఫ్యాషన్‌లో షోలో వీరిద్దరూ కలుసుకున్నారు ఆ తర్వాత ప్రేమించుకున్నారు. చాలాకాలం పేకల్లోతు ఓ ప్రేమలో మునిగితేలారు. తర్వాత ఏ విషయంలో మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ విడిపోయారు. అప్పట్లో వీరి బ్రేకప్ బాలీవుడ్ మీడియాలో పెద్ద సంచలనం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: