కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లు అయితే దాదాపు అన్ని సినిమాలు కూడా ఒకే భాగంతో వచ్చేవి. సినిమా ఎండింగ్ వచ్చింది అంటే ఎలాగోలాగా దానిని కంప్లీట్ చేసేవారు. ఇక రాజమౌళి భారీ బడ్జెట్ తో బాహుబలి సినిమాను మొదలు పెట్టాడు. ఇక ఆ స్టోరీ పెద్దది కావడం , దానికి బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఆ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించారు. ఇక మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. భారీ అంచనాల నడుమ విడుదల అయిన రెండవ భాగం కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి.
దానితో మేకర్స్ అంతా ఇప్పుడు అవసరం ఉన్న లేకపోయినా రెండవ భాగంపై దృష్టి పెడుతున్నారు. దానితో ఒక వేళ సినిమా ఎండింగ్ లో రెండవ భాగంకు హింట్ ఇస్తే మొదటి భాగం మంచి విజయం సాధిస్తే రెండవ భాగాన్ని ప్రారంభించడం , లేనట్లయితే దానిని అక్కడే వదిలి వేయడం జరుగుతుంది. దానితో ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా ఒక్క భాగంతో ఎండ్ కావడం లేదు. ఏదో ఒక ట్విస్ట్ పెట్టి రెండవ భాగం ఉండబోతుంది అని తెలియజేస్తున్నారు. సినిమా విడుదల అయిన తర్వాత ఆ మూవీ మంచి విజయం సాధిస్తే ఆ తర్వాతే రెండవ భాగం కు సంబంధించిన చిత్రీకరణను మొదలు పెడుతూ వస్తున్నారు.
మరి ముఖ్యంగా ఈ ట్రెండ్ ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలలో , పాన్ ఇండియా సినిమాలలో కనబడుతోంది. ఈ సినిమాలలో దాదాపు రెండు భాగాలతోనే చిత్రీకరిస్తున్నారు. దానికి ప్రధాన కారణం బడ్జెట్ కూడా అని చెప్పవచ్చు. ఎలాగో మొదటి భాగం కు వేసిన సెట్ లను రెండవ భాగంలో ఉపయోగించుకోవచ్చు. దాని ద్వారా ఖర్చు తక్కువ అవుతుంది. మొదటి భాగం మంచి విజయం సాధిస్తే రెండవ భాగానికి కలెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలా మొదటి భాగం విజయం సాధిస్తే రెండవ భాగాన్ని చిత్రీకరించడం , లేకపోతే మానేయడం జరిగిన సందర్భాలు అనేకం ఈ మధ్య కాలంలో అనేకం ఉన్నాయి.