పాట అద్భుతమైన రీతిలో సక్సెస్ కావాలి అంటే సంగీత దర్శకుడి పాత్ర ఎంత ఉంటుందో. దానికి సాహిత్యాన్ని అందించే లిరిక్ రైటర్ పాత్ర కూడా అంతే ఉంటుంది. అలాగే లిరిక్ రైటర్ అందించిన సాహిత్యాన్ని అర్థం చేసుకొని అది ఆ పాటకు కరెక్టా కాదా అనేది తెలుసుకునే బాధ్యత దర్శకుడిపై కూడా అంతే ఉంటుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన లిరిక్ రైటర్ గా పేరు తెచ్చుకున్న వారిలో చంద్రబోస్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో , ఎన్నో పాటలకు సాహిత్యాన్ని అందించాడు.
అలాగే ఈయన లిరిక్స్ అందించిన ఎన్నో పాటలు అద్భుతమైన స్థాయిలో సక్సెస్ ను కూడా అందుకున్నాయి. ఇకపోతే తాజాగా చంద్రబోస్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయనకు మీరు రాసిన పాటను ఏ దర్శకుడు అయినా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా అనే ప్రశ్న ఎదురయింది. దానికి చంద్రబోస్ సమాధానం ఇస్తూ ... చాలా మంది దర్శకులు మేము ఇచ్చిన లిరిక్స్ నచ్చలేదు అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరు అంతా కఠినంగా చెప్పరు. మాకు ఆ పాట వచ్చే సిచువేషన్ చెబుతూ ఉంటారు. కొన్ని సార్లు మేము రాసిన దానిని వారు అంగీకరించకపోవచ్చు.
ఒకాయనొక సందర్భంలో గబ్బర్ సింగ్ మూవీ లోని ఆకాశం అమ్మాయి అయితే అనే పాట లిరిక్ కోసం నేను మొదట ఒక వర్షన్ రాశాను. అది హరీష్ శంకర్ కి నచ్చలేదు. ఆ తర్వాత నేను మరో వర్షన్ రాశాను. అది కూడా ఆయనకు నచ్చలేదు. మూడవ సారి ఆకాశం అమ్మాయయితే నీలా ఉంటుంది అనే వర్షన్ రాశాను. అది ఆయనకు అద్భుతంగా నచ్చింది. దానిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా దర్శకులు తమకు ఏది నచ్చుతుందో అది మాకు కరెక్ట్ గా చెప్తే మేము అద్భుతమైన లిరిక్స్ రాస్తాము అని చంద్రబోస్ తాజాగా తెలియజేశాడు.