ఆ అభిమాని లవ్ ప్రపోజల్ కు ఓకే చెప్పిన సమంత.. వీడియో వైరల్..!!

murali krishna
సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేసి రెండున్నరేళ్లు అవుతుంది. అప్పటి నుండి సమంత ఒంటరిగానే ఉంటుంది. నాగ చైతన్య మాత్రం శోభిత ధూళిపాళ్లకు దగ్గరయ్యారు. నాగ చైతన్య, శోభిత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. మరి నాగ చైతన్య మాజీ భార్య సమంత సంగతేంటి అనే సందేహాలు మొదలయ్యాయి.విడాకులు సమంతను తీవ్ర వేదనకు గురిచేశాయి. చైతన్యతో విడిపోయాక ఆమె డిప్రెషన్ నుండి బయటపడేందుకు అనేక మార్గాలు ఎంచుకుంది. ముఖ్యంగా మిత్రులతో ఎక్కువగా గడిపేది. అలాగే ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది. వాస్తవంగా క్రిస్టియన్ అయిన సమంత... పలు హిందూ దేవాలయాలు సందర్శించింది. జగ్గీ వాసుదేవ్ బాబా ఫాలోవర్ గా సమంత మారిపోయింది.నాగ చైతన్య - శోభిత నిశ్చితార్థం జరిగాక మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కచ్చితంగా సమంత కూడా ఉంటుంది. అయితే వీటిలో ముఖ్యంగా సామ్ అటెన్షన్ క్యాచ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇది ముఖేష్ అనే అభిమాని రీల్ కాగా దాని వివరాలు ఏంటో చూద్దాం. ఇందులో ముఖేష్.. ' సమంత నువ్వు వర్రీ అవొద్దు నేను నీకున్నా. రెండు ఏళ్లలో ఫైనాన్సియల్ ఇండిపెండెంట్ గా మారిపోతా. పెళ్లి చేసుకుందాం ' అని చెప్తాడు.ఈ క్రమంలో సమంత ఇక రెండో వివాహం చేసుకోరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెను బాధ పెట్టిన నాగ చైతన్య మరో వివాహం చేసుకుంటున్న నేపథ్యంలో సమంత మనసు మారొచ్చనే వాదన తెరపైకి వచ్చింది. కాగా సమంతకు సోషల్ మీడియా వేదికగా అభిమాని నుండి పెళ్లి ప్రపోజల్ వచ్చింది. సదరు అభిమాని ప్రపోజల్ కి సమంత స్పందించడం విశేషం.దీనిపై రియాక్ట్ అయిన సామ్.. ' నీ బ్యాగ్ గ్రౌండ్ లో ఉన్న జిమ్ నన్ను కన్విన్స్ చేసింది ' అని చెప్పేసింది. దీంతో ఈ రిప్లయ్ తన రోజునే మార్చేసిందంటూ సామ్ ను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ చేయడంతో వైరల్ అయిపోయింది. ఇక తర్వాత పోస్ట్ లో ' సమంత అభిమానులు వెయ్యి మంది ఉంటే అందులో నేను ఒక్కడిని. వందమంది ఉంటే వారిలో ఒక్కడిని. ఒక్కరే ఉంటే అది నేనే. ఎవరు లేరంటే నేను భూమి మీద లేనట్లే ' ఒకవేళ సమంతకు ఈ ప్రపంచం వ్యతిరేకం అయితే నేను ప్రపంచానికి వ్యతిరేకిని'' అని పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ కావడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: