పుష్ప 2 : స్పెషల్ సాంగ్ కోసం ఆ హాట్ హీరోయిన్ ని దింపుతున్నారుగా..?

FARMANULLA SHAIK
తెలుగు సినిమా స్థాయిని భారీ స్థాయిలో పెంచేసిన వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలం పాటు టాలీవుడ్‌కే పరిమితం అయిన అతడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దీంతో మరింత ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను చేసేందుకు సన్నద్దం అవుతున్నాడు.పుష్ప ది రైజ్' సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా ఇప్పుడు 'పుష్ప ది రూల్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లర్‌గా మారిన పుష్పరాజ్.. బడా వ్యాపారిగా మారి సిండికేట్‌ బిజినెస్‌ను ఎలా రూల్ చేశాడన్న స్టోరీలైన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడగా.. అందుకు తగ్గట్లే తీస్తున్నారు.హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్'కు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రారంభించింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును పూర్తి చేసేశారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి.. ఎలాగైనా ఈ చిత్రాన్ని డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు.అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న 'పుష్ప ది రూల్' మూవీకి సంబంధించి తరచూ ఏదో ఒక విషయం ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే పుష్ప ది రైజ్' చిత్రంలో సమంత 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' అంటూ చేసిన స్పెషల్ సాంగ్ దేశం మొత్తాన్ని చూపేసింది. దీంతో దీనికి మించేలా 'పుష్ప ది రూల్'లో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకుంటున్నారు.అయితే ఈ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఆ సాంగ్ ఎవరు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని పై చర్చ జోరుగా సాగుతోంది. 

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పుష్ప 2లో ఐటెం సాంగ్ చేస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి.ఆతర్వాత లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల పేరు కూడా వినిపించింది. శ్రీలీల బన్నీతో కలిసి పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఆమె కావ్య థాపర్ . ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత ఊరు పేరు భైరవకోన సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ అమ్మడి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేస్తోందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: