ఈ హీరోయిన్లకు ఉన్న ధైర్యం.. మన హీరోలకు లేదా..?

Divya
హిందూ ధర్మం గురించి అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తూ.. హిందూ ధర్మం జోలికి వస్తే.. తాట తీసేస్తామనేటువంటి సినిమాలు అన్ని ఇండస్ట్రీలో కూడా చాలానే వస్తూ ఉంటాయి. అద్భుతంగా అటు హాలీవుడ్ బాలీవుడ్,కోలీవుడ్ , టాలీవుడ్ ఇలాంటి అన్ని ఊడ్లలో కూడా తీసినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. సూపర్ హీరోలు తొడలు కొట్టగలరు ఏమైనా చేయగలరు. కానీ హిందువులకు ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా వస్తే నోరు మెదపడానికి బాధ.. ఎందుకంటే మైనార్టీల అభిమానులు పోతారేమో ఓట్లు పోతాయేమో అని మైనార్టీలో ఉండేటువంటి కమ్యూనిట్లు కూడా ఫీలవుతారేమో అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.

అలా ఎందుకు ఫీల్ అవ్వాలి ఒక తప్పు ఎక్కడ జరిగినా కూడా అది తప్పని చెప్పొచ్చు కదా.. తాజాగా బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న ఘటనల పై  స్పందించకపోవడమే అందుకు  ఉదాహరణ..ఇంత వరకు బంగ్లాదేశ్ లో జరిగిన హింసలో మాట్లాడిన వారిలో కేవలం ఇద్దరే ఉన్నారు. అది కూడా బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే.. ఒకరు ప్రీతిజింతా, మరొకరు రవీనా టాండన్ .. వీళ్లు తప్ప ఒక్క బాలీవుడ్ హీరోలు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. అలాగే టాలీవుడ్ కోలీవుడ్, మాలీవుడ్ వంటి హీరోలు కూడా మాట్లాడలేదు. అయితే వేరే వర్గానికి సంబంధించి ఏదైనా చిన్నది జరిగిందంటే చాలు.. అయామ్ విత్ డాష్ డాష్ అంటూ వస్తూ ఉంటారు.

మనదేశంలో మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి వాళ్లు.. హీరోల  అభిమానులు మాత్రం చచ్చినట్టుపడి ఉండే వాళ్ళు లాగా కనిపిస్తున్నారా అని పలువురు హిందువులు అడుగుతున్నారు.. ఒక 10 శాతం 20 శాతం ఉన్నటువంటి వాళ్లు చూడకపోతే సినిమాలు ఏమైతాయో అనే పరిస్థితి కూడా ఉన్నది.. కానీ వాళ్ల కోసం అయితే మాత్రం అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు ఇదే వింత... మరి ఇప్పటికైనా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ ఘటన పైన ఏ సెలబ్రిటీలు మాట్లాడతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: