నదిలో భర్తతో అలా కనిపించి షాకిచ్చిన రకుల్..ఫ్యాన్స్‌కు పండగ

Suma Kallamadi
టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థల్లో భగ్నానీ నిర్మాణ సంస్థ కూడా ఒకటి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే భారీ సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకూ సక్సెస్ కాలేకపోయాయి. దీంతో భగ్నానీ సంస్థకు వందల కోట్లు అప్పులు మిగిలాయి. ఆ సంస్థ అప్పుల నుంచి తిరిగి కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అయితే ఆ సంస్థ అధిపతుల్లో ఒకరైన జాకీ భగ్నానీయే రకుల్ భర్త. ప్రస్తుతం తన కంపెనీ అప్పుల్లో మునిగిపోయి ఉంటే ఆయన మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన భార్య రకుల్‌తో టూర్లు చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో దీనిపై పలువురు భగ్గుమంటున్నారు.
రకుల్ తన భర్తతో కలిసి వెల్ నెస్ ట్రిప్ ప్లాన్ చేసి నదీతీరంలో జాలీగా తిరుగుతోంది. అలాగే జాకీ భగ్నానీతో పాటు ఫుల్ ఫ్రీడమ్‌తో జాలీ రైడ్‌లు చుట్టేస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను రకుల్ స్వయంగా తన ఇన్‌ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అందులో రకుల్ స్విమ్ సూట్ వేసుకుని నదిలోకి జంప్ చేసే ఫోటోలను ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తున్నారు. ఫోటోలను షేర్ చేస్తూ ఓ నోట్‌ను కూడా రకుల్ రాసుకొచ్చింది.
ఈ వారం అద్భుత ప్రయాణం సాగిందని, తన బెస్ట్ గాయ్ జాకీ భగ్నానీతో సంతోషంగా గడిపానని రకుల్ తెలిపింది. ఆ నోట్‌కు ప్రగ్యా జైశ్వాల్‌తో పాటుగా చాలా మంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. లవ్ హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. ఇకపోతే తెలుగులోకి కెరటం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే మూవీతో సక్సెస్ అందుకుంది. ఇప్పటి వరకూ మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. తమిళంలో కూడా పలు చిత్రాలు చేసి బాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: