మాస్ మహారాజ్ మైల్ స్టోన్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

frame మాస్ మహారాజ్ మైల్ స్టోన్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

murali krishna
హీరోరవితేజ వరు మాస్ మహారాజా వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు విడుదల చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ ఈ నెల 15న విడుదలకానుంది. ఇదిలావుండగా రవితేజ 75వ సినిమా టైటిల్‌ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్నది.ఇక ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈయన గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న సమాజవరగమన సినిమా కి రచయితగా వర్క్ చేశాడు. విభిన్న కథలతో మెప్పించిన భాను చాలా కొత్తగా ఉండే కథతో రవితేజ తో సినిమాగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ను దాదాపుగా కన్ఫర్మ్ చేశారు.ఈ సినిమా టైటిల్ కోహినూర్. ఓ డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కించబోతున్నారు. వింటేజ్ రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. రవితేజ గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జోనర్ కాకుండా మళ్లీ తన మార్క్ కామెడిని ఈ సినిమా చూపించబోతున్నారని తెలుస్తుంది..రవితేజ ఇందులో లక్ష్మణ్‌ భేరి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందనున్నట్లు అర్థమవుతోంది. ఉగాదికి రిలీజ్ చేసిన పోస్టర్ లో ‘‘2025 సంక్రాంతికి రవన్న దావత్‌ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి’’ అంటూ స్పష్టత ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ చిత్ర నిర్మాణంలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థ భాగస్వామిగా వ్యవహరించనుండగా.. శ్రీకర స్టూడియోస్‌ సంస్థ సమర్పించనుంది.ఇదిలా ఉండగా రవితేజ నుంచి మాస్ టైటిల్స్, క్యాచీ టైటిల్స్ తో వచ్చిన సినిమాలు మంచి హిట్స్ సాధించాయి. దాంతో ఇప్పుడు ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ మూవీలో ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి మాస్ మహారాజాతో జతకట్టబోతోంది. ఈ కాంబోకి ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. భీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సంక్రాంతికి పోటీ ఉన్నప్పటికీ.. రవితేజకు ఈ పండగ కలిసొస్తుంది అన్నది మేకర్స్ భావన.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: