దేవర కత్తికి ఆయుధ పూజ.. లేటెస్ట్ పోస్టర్ వైరల్..!!

frame దేవర కత్తికి ఆయుధ పూజ.. లేటెస్ట్ పోస్టర్ వైరల్..!!

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కొరటాల ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దుతున్నారు. మరి లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా సినిమా మూడో సాంగ్, ఎన్టీఆర్ ఓపెనింగ్ సీక్వెన్స్ పై బయటకి రాగా ఈ సీక్వెన్స్ పై మరో క్రేజీ అప్డేట్ ని తాను అందించారు.దేవర సెట్స్ నుంచి ఆయుధ పూజ జరుగుతుంది అంటూ సినిమాలో వాడే పవర్ఫుల్ డిజైన్డ్ కొడవలి కత్తిని చూపిస్తూ రివీల్ చేసారు. దీనితో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇలా మొత్తానికి అయితే అయితే మేకర్స్ ఎన్టీఆర్ తో వేరే లెవెల్ మాస్ నే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమా శరవేగంగా తుదిమెరుగులు దిద్దుకుంటుంది.ప్రస్తుతం ఆయుధ పూజ పాట చిత్రీకరణ నడుస్తుందని మూవీ టీం సోషల్ మీడియాలో పంచుకుంది. పోస్టర్లలో ఎన్టీఆర్ చేతుల్లో కనిపిస్తున్న గొడ్డలి వంటి ఆయుధం తాలూకు ఫోటోలను పోస్ట్ చేసింది. అటు తను ఆయుధపూజ సాంగ్ షూట్ చేస్తూ ఎమోషనల్ అయ్యానని గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి పోస్ట్ చేశారు.కాగా చుట్టములే సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్  లో ఉన్న సంగతి తెలిసిందే.కొరటాల శివ ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీని రెండు భాగాలుగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నారు. దేవర పార్ట్ 1 ఆగస్టు 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇప్పటికే మొదలుపెట్టారు.ఆయుధ పూజ సాంగ్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాజు సుందరం మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈ ఆయుధ పూజ సాంగ్ పవర్ ఫుల్ ఎలివేషన్ తో ఉంటుందనే మాట వినిపిస్తుంది.
ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాబోయే మూడు పాటలు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచుతాయనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ మూడు సాంగ్స్ ని వేర్వేరు సిటీస్ లో చిన్న చిన్న ఈవెంట్స్ లా ప్లాన్ చేసి లాంచ్ చేయబోతున్నారంట. అలాగే ట్రైలర్ లాంచింగ్ ని ఓ పెద్ద ఈవెంట్ గా నిర్వహించబోతున్నారంట. దేవర మూవీ రిలీజ్ కి ముందు సినిమాకి వీలైనంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం ఈ ఈవెంట్స్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: