ఫ్లాప్ తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చింది.. చెప్పిన మాటలకి ఎమోషనల్ అయ్యాను.. పూరి జగన్నాథ్..!

frame ఫ్లాప్ తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చింది.. చెప్పిన మాటలకి ఎమోషనల్ అయ్యాను.. పూరి జగన్నాథ్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక విజయాలను అందుకొని చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ల స్థాయికి వెళ్లిపోయాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఇది ఇలా ఉంటే రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలను అందించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే పూరి జగన్నాథ్ తాజాగా రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు.

ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ మూవీ బృందం వరంగల్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పూరి జగన్నాథ్ , విజయేంద్ర ప్రసాద్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. డబల్ ఇస్మార్ట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ... నాకు కొన్ని రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది విజయేంద్ర ప్రసాద్. ఆయన ఎప్పుడూ నాకు ఫోన్ చేయడు. దానితో ఆయన ఫోన్ వస్తుంటే ఈయన ఎందుకు ఫోన్ చేస్తున్నాడా అని అనిపించింది. ఫోన్ లిఫ్ట్ చేశాను. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఫ్రీ గానే ఉన్నారా అన్నాడు.

ఉన్నాను సార్ చెప్పండి అన్నాను. మీతో నాకు ఒక పని పడింది అన్నాడు. దానితో వీళ్ళ కొడుకే రాజమౌళి ... పెద్ద డైరెక్టర్ నాతో ఏం పని ఉంటుందా అనుకున్నాను. దానితో ఆయన సార్ మీరంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే మీరు ఈ మధ్య కాలంలో సినిమాలు తీయడంలో కాస్త విఫలం అవుతున్నారు. మీరు నెక్స్ట్ మూవీ చేసేటప్పుడు ఆ కథను నాకు ఒక సారి వినిపించండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను చెబుతాను అన్నాడు. అంత గొప్ప వ్యక్తి అలా చెప్పే సరికి నాకు నేను ఎమోషనల్ అయ్యాను. కానీ ఈ సినిమా కథ ఆయనకు చెప్పలేదు. ఆయనకు ఒక మంచి సినిమా తీసి చూపిద్దాం అనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను అని పూరి జగన్నాథ్ తాజాగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: