సినిమా ప్లాప్ తర్వాత ఎవ్వరు పట్టించుకోలేదు.. ఒక్కరు తప్ప: పూరి జగన్నాథ్
ఇకపోతే పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం డబల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ద్వితీయ భాగంగా వస్తోంది. మొదటి భాగం ఇస్మార్ట్ శంకర్.. సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు వస్తున్న ద్వితీయ భాగం 'డబుల్ స్మార్ట్' సినిమా పైన ప్రేక్షకులలో అనేక అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా రిలీజ్ కి దగ్గర పడడంతో.. తాజాగా చిత్ర యూనిట్ హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. నివేదికపై దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... తీవ్రమైన భావోద్వేగానికి గురవడం జరిగింది.
అసలు విషయం ఏంటంటే... ఎంతటి వారికైనా జీవితంలో గెలుపోటములు అనేవి సర్వసాధారణం. ఆ విధంగానే పూరి జగన్నాథ్ సినిమా కెరియర్ లో అనేక ఎత్తుపల్లాలను చూశారు. సూపర్ డూపర్ హిట్ లను తీసిన పూరి జగన్నాథ్, భారీ ప్లాపులను కూడా తీయడం జరిగింది. అయితే మనం గెలిచినప్పుడు అందరూ మన చుట్టూ చేరుతారు. అదే ఓటమి ఉన్నప్పుడు నా అన్నగారు కరువు అవుతారు అనేది నగ్న సత్యం. ఈ విషయాన్ని ఉటంకిస్తూ పూరి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ వేదికపై పూరి మాట్లాడుతూ... " ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ సినిమా తీవ్ర నిరాశపరిచింది. ఆ సమయం మాకు గడ్డుకాలం. ఆ క్షణంలో మమ్మల్ని పలకరించే నాధుడే కరువయ్యాడు. కానీ.. దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి గారు అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు.. ఫోన్ చేసి.. మీరు ఏదన్నా సినిమా తీసే ముందు, ఒక్కసారి ఆ కథని మాకు వినిపించండి. అందులో లోటుపాట్లు ఉంటే మేము చెబుతాము. ఇలా మాట్లాడుతున్నానని మరేమీ అనుకోవద్దు... ఒక ప్రతిభ కలిగిన దర్శకుడు ప్లాప్ తీస్తే నేను తట్టుకోలేను... అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారట! " ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్ చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది.