నిహారికకు ప్రత్యేకంగా కంగ్రాట్యులేషన్స్ తెలియజేసిన మహేష్‌..

frame నిహారికకు ప్రత్యేకంగా కంగ్రాట్యులేషన్స్ తెలియజేసిన మహేష్‌..

Suma Kallamadi
మెగా డాటర్ నిహారిక ఇటీవల "కమిటీ కుర్రోళ్ళు" సినిమాతో సినిమా ప్రొడ్యూసర్ అయిన సంగతి తెలిసిందే. మొన్నటిదాకా నిహారిక ఓన్లీ వెబ్ సిరీస్‌లు మాత్రమే ప్రొడ్యూస్ చేసేది. ఇప్పుడు మాత్రం ఒక ఫుల్ లెన్త్ ఫీచర్‌ ఫిల్మ్ తీసి పెద్ద సాహసమే చేసింది. అయితే ఆమె నిర్మాతగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించింది. సినిమా చాలా బాగుంది. ఇందులోని ఫస్టాఫ్ చిన్ననాటి జ్ఞాపకాలను అందరికీ గుర్తు చేస్తుంది. పల్లెటూరిలోని స్నేహాలు, ప్రేమ కథలను ఆకట్టుకునే లాగా ఈ సినిమాని తీశారు. ఈ మూవీని నిహారిక చాలా తెలివిగా సెలెక్ట్ చేసుకుంది. అందుకే ఆమె ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యింది.
2024 మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయ్యారు. మరోవైపు చిరంజీవి పద్మ విభూషణ్ పౌర పురస్కారం అందుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న నిహారిక ఫస్ట్ సినిమాతోనే ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయ్యింది. అందువల్ల నిహారికకు చాలామంది కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.
సినిమా సెలబ్రిటీలు కూడా ఆమెను విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నిహారికకు స్పెషల్ గా అభినందనలు తెలిపారు. "రీసెంట్ టైంలో కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి చాలా మంచి విషయాలు వింటున్నా. మూవీ ప్రొడక్షన్ లో అడుగుపెట్టినందుకు, ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ సాధించినందుకు కంగ్రాట్స్ నిహారిక. త్వరలోనే ఈ సినిమా కచ్చితంగా చూస్తా. " అని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా మెగా డాటర్ కు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో నిహారిక బాగా హ్యాపీగా ఫీల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ కూడా మహేష్ బాబుకు థాంక్స్ చెబుతున్నారు. యదు వంశీ డైరెక్ట్ చేసిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9న విడుదల అయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. నిహారిక ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేయడమే కాక ఇందులో ఒక చిన్న పాత్ర కూడా పోషించింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: