సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అందులో కొంత మంది మొదటి సినిమాతో మంచి గుర్తింపును , మంచి సక్సెస్ ను అందుకొని ఆ తర్వాత వరస అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. మరి కొంత మంది నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆ తర్వాత కూడా అలాంటి అనుభవాలే ఎదురైనట్లు అయితే వారు కొంత కాలం లోనే ఇండస్ట్రీలో కనమరుగైపోతుంటారు. ఇకపోతే మరి కొంత మంది మాత్రం నటించీమ మొదటి సినిమా కూడా విడుదల కాకుండానే అదిరిపోయే రేంజ్ లో ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తారు.
అలాంటి వారిలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న చాలా సినిమాలలో అవకాశాలు దక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటుంది.
అందులో భాగంగా ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... చిన్న వయసులో నేను కాస్త లావుగా ఉండేదాన్ని. దానితో డాన్స్ కూడా గొప్పగా చేసేదాన్ని కాదు. దానితో కొంత మంది నన్ను గేలి చేసేవారు అని ఈమె చెప్పింది. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈమె అద్భుతమైన స్లిమ్ లుక్ లో అదిరిపోయే అందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలలో భాగ్య శ్రీ తన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది.