అప్పుడు రజనీకాంత్... ఇప్పుడు ప్రభాస్ మళ్లీ సీన్ రిపీట్ కానుందా..?

frame అప్పుడు రజనీకాంత్... ఇప్పుడు ప్రభాస్ మళ్లీ సీన్ రిపీట్ కానుందా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎప్పుడూ కూడా ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆడియన్స్ కూడా వారిని కమర్షియల్ సినిమాలలో చూడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారు వైవిధ్యమైన సినిమాలలో నటించినట్లు అయితే అలాంటి సినిమాలు పెద్ద స్థాయిలో విజయాలను అందుకోవడం కాస్త కష్టం అవుతుంది. ఇక స్టార్ హీరోలు ఎక్కువ శాతం సస్పెన్స్  థ్రిల్లర్స్ , హర్రర్ కామెడీ సినిమాలలో దాదాపుగా నటించరు. ఎందుకు అంటే హార్రర్ కామెడీ సినిమాలు కేవలం జనాలు ఒకే సారి చూడడానికి ఇష్టపడతారు. మాస్ హీరోలపై బడ్జెట్ ఎక్కువ అవుతుంది.

దానితో అలాంటి సినిమాలలో నటించడానికి కూడా స్టార్ హీరోలు ఎక్కువగా ఇష్టపడరు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ "చంద్రముఖి" అనే హార్రర్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా చేస్తున్న సమయంలో స్టార్ హీరో అయి ఉండి రజనీ కాంత్ ఎందుకు హార్రర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వల్ల ఆయనకు పెద్దగా ఎలాంటి లాభం ఉండదు అని చాలా మంది అన్న వారు ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ లాభాలను అందుకుంది. ఆ సినిమా ద్వారా రజనీ కాంత్ కూడా సూపర్ సాలిడ్ గుర్తింపు లభించింది.

ఇకపోతే ఇండియా వ్యాప్తంగా క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా హార్రర్ , రొమాంటిక్ , కామెడీ జోనర్ లో రూపొందుతుంది. దానితో ప్రభాస్ లాంటి హీరో ఎందుకు ఈ జోనర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వల్ల ఆయనకు పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు అనే జనాలు కూడా ఉన్నారు. కాకపోతే మరి కొంత మంది మాత్రం ఈ సినిమా సూపర్ గా ఉంటుంది. ఈ మూవీ తో ప్రభాస్ కి సరికొత్త ఈమేజ్ దక్కుతుంది అని కొంత మంది అంటున్నారు. మరి ప్రభాస్ కి రాజా సాబ్ మూవీ ద్వారా ఎలాంటి ఇమేజ్ , ఏ రేంజ్ సక్సెస్ దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: