కొత్త దర్శకుడు యదు వంశీ "కమిటీ కుర్రాళ్ళు" అనే సినిమాను తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మెగా డాటర్ నాగబాబు కుమార్తె అయినటువంటి నిహారిక నిర్మించింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చిన కూడా ఆ స్థాయి కలెక్షన్లు రాలేదు. దానికి ప్రధాన కారణం ఓ వైపు చాలా రోజుల క్రితమే విడుదల అయినా కల్కి 2898 AD సినిమా ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9 వ తేదీన విడుదల అయింది.
ఇదే తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరో గా రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మురారి సినిమాను థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు. దానితో ఆగస్టు 9 వ తేదీన మురారి సినిమా రీ రిలీస్ ఎఫెక్ట్ కమిటీ కుర్రాళ్ళు సినిమాపై గట్టి గానే పడింది. దానితో కమిటీ కుర్రాళ్ళు సినిమాకు విడుదల అయిన మొదటి రోజే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చినా కూడా భారీ మొత్తంలో కలెక్షన్ లు మాత్రం రాలేదు.
ఇకపోతే విడుదల అయిన 3 వ రోజు మాత్రం కమిటీ కుర్రాళ్ళు సినిమా ఇటు కల్కి , అటు మురారి రెండు సినిమాలను కూడా వెనక్కు నెట్టేసి ముందు వరస లోకి వచ్చేసింది. విడుదల అయిన 3 వ రోజు కమిటీ కుర్రాళ్ళు సినిమాకు సంబంధించిన 34 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ కాగా , కల్కి మూవీ కి సంబంధించిన టికెట్లు 25 కే సేల్ అయ్యాయి. ఇక మురారి మూవీ కి సంబంధించిన 15 కే టికెట్లు సేల్ అయ్యాయి. ఈ విధంగా చూసినట్లు అయితే విడుదల అయిన 3 వ రోజు కమిటీ కుర్రాళ్ళు సినిమా ఓ వైపు కల్కి మరో వైపు మురారి ఈ రెండు సినిమాలను కూడా వెనక్కు నెట్టేసి ముందు వరస లోకి వచ్చేసింది.