ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే గేమ్ చేంజర్ భారీ బ్లాక్ బాస్టర్ పక్కా.. ఫుల్ ఖుషిలో మెగా ఫ్యాన్స్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. రామ్ చరణ్ తాజాగా ఇండియాలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియార అద్వానీ హీరోయిన్ గా నటించగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. ఎస్ జే సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాలు ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే చాలా మంది శంకర్ దర్శకత్వంలో తాజాగా రూపొందిన ఇండియన్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో గేమ్ చేంజర్ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంది అని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఓ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ సెంటిమెంట్ ఏమిటి అనుకుంటున్నారా ... ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. పెళ్లి అయిన చాలా సంవత్సరాలు తర్వాత రామ్ చరణ్ , ఉపాసన దంపతులకు ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. అలాగే చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. తాజాగా నిహారిక "కమిటీ కుర్రాళ్ళు" సినిమాను నిర్మించగా అది కూడా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో రామ్ చరణ్ కూడా ఈ సంవత్సరం గేమ్ చేంజర్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని మెగా ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: