కృష్ణవంశీ, పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ అదేనా..?

murali krishna
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో అద్భుతమైన, కళాత్మకమైన చిత్రాలు తెరకెక్కించారు. అందులో మహేష్ బాబు మురారి ఒకటి.అప్పట్లో కుటుంబ కథా చిత్రాలు తీయడంలో కృష్ణవంశీది అందె వేసిన చెయ్యి అని చెప్పాలి. సింధూరం, నిన్నే పెళ్లాడతా, మురారి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇక ఇప్పుడున కృష్ణవంశీ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారి చిత్రం రికార్డులు సృష్టిస్తోంది.మురారి రీరిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ అభిమానులతో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఎందుకు చేయలేదు అనే చర్చ జరిగింది. దీనిపై కృష్ణవంశీ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.ఇక సోషల్ మీడియా వచ్చాక అభిమానులకు దగ్గరగా ఉంటున్న కృష్ణవంశీ.. నిత్యం వారితో చిట్ చాట్ చేస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు. తాజాగా మరోసారి కొంతమంది నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు కృష్ణవంశీ ఓపిగ్గా సమాధానాలు తెలిపాడు. ఇక ఆయన కెరీర్ లో చాలామంది స్టార్ హీరోలతో పనిచేశారు. ఎందుకో పవన్ కళ్యాణ్ తో మాత్రం ఒక్క సినిమా కూడా తీయలేదు. ఇదే విషయాన్ని ఒక నెటిజన్ బయటపెట్టాడు.“పవన్ కళ్యాణ్ కు మీరెప్పుడైనా కథ చెప్పారా.. ? మీ కాంబోలో ఒక సినిమా వచ్చి ఉంటే బావుండేది” అని అడిగాడు. దానికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. “పవన్ కళ్యాణ్ కు కథ చెప్పాను. ఆయనకు కూడా నచ్చింది. కానీ, చేయడం కుదరలేదు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా. ఒకవేళ ఆ సినిమా వచ్చి ఉంటే. బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ అయ్యేది.. నా దురదృష్టం అంతే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేకపోవడం నా దురదృష్టం. మెగా ఫ్యామిలీతో కృష్ణ వంశీకి మంచి సాన్నిహిత్యం ఉంది.ఇక అభిమానులు అయితే మహేష్ కొడుకుతో మురారి 2 చేయమని అడుగుతున్నారు. దీనికి కృష్ణవంశీ బదులిస్తూ.. అది డిసైడ్ చేయాల్సింది నేను కాదు.. మహేష్ బాబు నమ్రత నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు.ఇక ప్రస్తుతం పవన్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. వాటిని ఫినిష్ చేసి.. సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.మరి అభిమానుల కోరిక భవిష్యత్ లో నెరవేరుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: