రాజాసాబ్ షూటింగ్ సెట్ లో ప్రభాస్..షూటింగ్ అప్డేట్ వైరల్..!!

frame రాజాసాబ్ షూటింగ్ సెట్ లో ప్రభాస్..షూటింగ్ అప్డేట్ వైరల్..!!

murali krishna
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ లో సెట్లో తాజా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్లో జరుగుతోంది. ఈ సెట్లో హారర్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. మారుతి రూపొందిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది.టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. శస్త్రచికిత్స కారణంగా ఇంతకాలం షూటింగులకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ ఫామ్లోకి వచ్చి వరుస చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'రాజా సాబ్' సెట్స్లోకి అడుగుపెట్టారు.ఇక ప్రభాస్ను చూసిన కొంత మంది ఫ్యాన్స్ ఆయన్ను వీడియో తీసి దాన్ని నెట్టింట షేర్ చేశారు. అందులో అందులో ఆయన గడ్డం, జుట్టుతో పాటు తన డ్రెస్సింగ్ స్టైల్ను కూడా మార్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. వింటేజ్ ప్రభాస్ తిరిగొచ్చారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాను త్వరగా రిలీజ్ చేస్తే బాగున్ను అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజాసాబ్’ సైలెంట్ మొదలవ్వడంతో ఏదో చిన్న బడ్జెట్ సినిమా అని అందరు అనుకున్నారు. కానీ మొదలయ్యాక ఒక్కొక్క విషయం లీక్ అవుతుంటే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఈ తెలుగు సినిమా ప్రేమికుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రభాస్, ‘బాహుబలి’తో గ్లోబల్ స్టార్‌గా మారిన తర్వాత ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో రూపొందుతుంది. ఇటీవల కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి వెయ్యి కోట్ల బాక్సాఫీస్ ను టచ్ చేశాడు. ఇక ‘రాజాసాబ్’ సినిమా కూడా ఒక సరికొత్త ప్రమాణాన్ని సృష్టించబోతోందని అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: