మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పార్ట్‌కు సంబంధించి శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ డేట్‌ను ఫైనల్‌గా ఫైనల్ చేశారు. సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో.. ఎంటైర్ ఇండియాలోని సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ పాన్ ఇండియా భారీ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవైపు శరవేగంగా చిత్రీకరణను జరుపుతూనే.. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర పాటల సందడి మొదలైపోయింది. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చిన టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయినా అది మల్టీ స్టారర్ కావడంతో సోలో హీరోగా తారక్ ని చూసేందుకు అరవింద సమేత రాఘవ తర్వాత ఇంత కాలం పట్టడంతో ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి.ఇటీవల మొదటి సింగిల్ ‘ఫియర్ సాంగ్’ ను రిలీజ్ చేయటం ద్వారా ఫిల్మ్ మేకర్స్ ‘దేవర’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట అన్నీ మాధ్యమాల్లో గ్లోబల్ రేంజ్ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది.
ఈ నేపధ్యం లోనే చుట్టమల్లే చుట్టేస్తాందె అంటూ సాగిపోయే సెకండ్ సింగిల్ సోమవారం (ఆగస్ట్ 5) రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటలో అందరి కళ్లూ తారక్, జాన్వీ మీద ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్లో వచ్చే లిరిక్స్, మ్యూజిక్ కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి.అలాగే యూట్యూబ్‌లో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ పాట. అంతేకాకుండా "ఈ సాంగ్ మోస్ట్ అడిక్టివ్ డ్రగ్‌గా మారిపోయిందని నిరూపితమయింది" అని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో చుట్టమల్లె.. పాట ఈ ఏడాది బెస్ట్ మెలోడీ సాంగ్‌గా ప్రేక్షకులను మెప్పించనుంది.ఇదిలావుండగా మ్యూజిక్ లవర్స్ కు ఆ మూవీ సంగీత దర్శకుడుఅనిరుద్ రవిచందర్ థాంక్స్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దేవరపాటలకు మీరు ఇస్తున్న క్రేజీ లవ్ కు థాంక్యూ.మనం ఇప్పుడే మొదలుపెట్టాం మునుముందు ఇంకా చాలా వస్తాయి అని పేర్కొన్నారు.మరి అనిరుద్ సాంగ్స్ స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కుతాయి అనటంలో అతిశయోక్తి లేదు.