హాట్ ఫోటోస్‌తో ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చిన సంయుక్త మీనన్

Suma Kallamadi
టాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీమ్లానాయక్ మూవీతో తెలుగు తెరకు కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ట్యాలెంటెడ్ హీరో నిఖిల్‌కు జోడీగా స్వయంభు అనే మూవీ చేస్తోంది. సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న హీరోయిన్లలో సంయుక్త మీనన్ కూడా ఒకరు. హీరో ధనుష్‌తో సార్ మూవీలో నటించి కుర్రకారును అట్రాక్ట్ చేసింది. అంతకుముందు కళ్యాణ్ రామ్‌తో బింబిసార మూవీలో కనిపించింది. ఇక సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష మూవీ చేసి తన నటనతో క్రేజ్‌ను సంపాదించుకుంది. నటనతో పాటుగా గ్లామర్ లుక్స్‌తో అదరగొట్టిన సంయుక్త మీనన్ కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లోకి చేరిపోయిందని చెప్పాలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఫోటో షూట్‌తో ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది.

తాజాగా సంయుక్త మీనన్ ఫిట్ అండ్ ఫ్యాబ్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మలయాళి బ్యూటీ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ తన నడుము సైజ్ ను తగ్గించుకుంటోంది. 108 రోజులుగా సంయుక్త జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోంది. తన సన్నజాజి నడుము ఫోటోలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ ఫోటోలు చూసిన అభిమానులు సంయుక్త నడుములో ఏదో రహస్యం దాగుందని కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సంయుక్త కమిట్‌మెంట్, డెడికేషన్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే సంయుక్త ఫిట్ నెస్ వెనక సుప్రియ అయ్యర్ అనే కోచ్ శిక్షణ ఉందని తెలుస్తోంది. నడుము కొలతలను సరైన విధంగా సెట్ చేసుకునేందుకు కోచ్ మంచి కసరత్తులు చేయించినట్లుగా అర్థం అవుతోంది. సంయుక్త ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న స్వయంభు మూవీ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో మ‌హారాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే మూవీలో, అలాగే మోహ‌న్ లాల్‌తో రామ్ అనే మ‌ల‌యాళ‌ మూవీలో సంయుక్త మీనన్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: