ప్రభాస్ 'కల్కి' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

frame ప్రభాస్ 'కల్కి' ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

murali krishna
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్టర్`కల్కి 2898 ఏడీ’. ది గ్రేట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, హీరోయిన్ దీపిక పదుకొనే వంటి గొప్ప యాక్టర్స్ నటించిన ఈ చిత్రం జూన్ 27 న ప్రపంచవ్యాప్తం గా విడుదలైంది. 39 సంవత్సరాల తరువాత ఇండియన్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమా లో కలిసి నటించడం తో ఈ చిత్రం విలువ ఇంకా పెరిగింది. సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం భారీ స్థాయి లో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.కల్కి చిత్రం 1100 కోట్ల వసూళ్లు సాధించి తిరుగులేని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి ప్రభాస్ సత్తాని ఇండియా మొత్తం తెలియజేసిన చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ తన విజన్ తో హాలీవుడ్ స్థాయి విజువల్స్ చూపిస్తూ అబ్బురపరిచారు.మహాభారతం, కలియుగం లాంటి అంశాలని మిక్స్ చేసి అద్బుతం సృష్టించాడు. కల్కి చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది.బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎప్పుడొస్తుందా అని డార్లింగ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యం లో సినీ ప్రియుల్లో జోష్‌ నింపే వార్త ఒకటి తెగ వైరల్‌ అవుతోంది.ఈ నెలలోనే కల్కి చిత్రం ఓటిటిలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగష్టు 23 నుంచి కల్కి చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్.థియేటర్స్ లో చూపించిన సినిమాకి మరో 6 నిమిషాల సన్నివేశాలని జోడించి ఓటిటి లో రిలీజ్ చేయబోతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ జరిగితే ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.అమెజాన్ ప్రైమ్‌ లో తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో కల్కి స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రసారం చేయనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: