భాగ్యశ్రీ బోర్స్ : హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అదే జోష్?

frame భాగ్యశ్రీ బోర్స్ : హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అదే జోష్?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లు సినిమా నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమా ప్రమోషన్లలో కూడా చురుగ్గా పాల్గొన్నట్లు అయితే సినిమా జనాల్లోకి వెళ్లేందుకు మరింత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొంత మంది హీరోయిన్లు సినిమా చేస్తారు ... వెళ్ళిపోతారు. ప్రమోషన్ల గురించి పెద్దగా పట్టించుకోరు. దాని వల్ల హీరోయిన్ లేకపోయినా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. మరి కొంత మంది హీరోయిన్లు మాత్రం సినిమా పూర్తి చేయడం మాత్రమే కాదు సినిమా తర్వాత ఆ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటుంటారు.

ఆ స్థాయిలో వారు ప్రమోషన్ చేయడం ద్వారా సినిమాకు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసింది. రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే ఈమె తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సినిమాలో హీరోయిన్గా నటించి సైలెంట్ అయిపోవడం కాకుండా ఈ సినిమా ప్రమోషన్లలో చాలా చురుగ్గా పాల్గొంటుంది. కేవలం ప్రమోషన్లలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఈమె దాదాపుగా ఈ సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ కు వచ్చిన కూడా అక్కడ చాలా చురుగ్గా ఉంటూ పాటలకు డ్యాన్సులు కూడా చేస్తూ వస్తుంది.

ఇంతకు ముందే ఒక ఈవెంట్ లో ఈమె తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ బృందం నిన్న రాత్రి ఈ మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. అక్కడ కూడా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని సూపర్ గా డాన్స్ చేసింది. దానితో ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈమె సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకోవడానికి రెడీగా ఉందో ఈ సినిమా ప్రమోషన్లలో కూడా అదే స్థాయిలో తన అందాలతో ఆకట్టుకుంటుంది. అలాగే ఈమె ఈ సినిమా ప్రమోషన్లలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఈ సినిమాకు మరింత ప్లేస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsb

సంబంధిత వార్తలు: