మీడియాలో ఆ వార్తలు చూసి భరించలేకపోయానంటోన్న మలైకా అరోర
మలైకా అరోరా తన 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్ నెస్‌తో పాటు ప్రత్యేక స్టైల్‌ను కూడా మెయింటెయిన్ చేస్తున్నారు. ఆ విషయంలో కూడా ఆమెను అభినందించేవారు చాలా మంది ఉన్నారు. 48 ఏళ్ల వయసులో మరింత హాట్‌గా ఉన్నారంటూ ఎవరైనా చెబుతుంటే తనకు ఆనందం వేస్తుందని, ఆ ఆనందం వల్ల బ్యాడ్ కామెంట్స్‌ను పట్టించుకోనని ఆమె తెలిపింది. అర్జున్ కపూర్‌తో విడిపోయిందనే పుకార్లు మొదలయ్యాక మలైకా మానసిక స్థితి దారుణంగా మారింది.
తన బర్త్ డే వేడుకలకు అర్జున్ అటెండ్ కాకపోవడం మరింత బాధను కలిగించిందని మలైకా తెలిపింది. అయితే తన జీవితంలో తన గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమే ఇతరులను కంట్రోల్ చేయకూడదనే విషయం కూడా ముఖ్యమని మలైకా తేల్చి చెప్పింది. ప్రతి ఒక్కరూ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలని సూచించింది. రాత్రిల్లో డ్యాన్స్ చేయడం, ఉదయాన్నే యోగా చేయడం, గ్రీన్ జ్యూస్ తాగడం, సలాడ్ తినడం, చెప్పులు లేకుండా నడవడం లాంటివి తన సొంత నియమాలని, వాటి వల్లే తన జీవితం స్ట్రాంగ్‌గా ఉందని మలైకా అరోరా ఓ నోట్ ద్వారా తెలిపింది.